ఆ మూవీతో సమంత స్పెషల్ బాండ్.. ‘అదే నా బెస్ట్’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.

Update: 2026-06-16 01:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న సమంత.. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాలపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ పై ఆమె చూపించిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో సమంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్:

ఇక ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సమంతకు కొన్ని క్రేజీ ప్రశ్నలు ఎదురయ్యాయి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఆమె నటించిన హిట్ సినిమాలలో ఒకదాన్ని ఎంచుకోమని అడిగారు. ముందుగా ‘ఏ మాయ చేసావే’ లేదా ‘ఈగ’ అని అడగగా.. సమంత ఏమాత్రం ఆలోచించకుండా ‘ఏ మాయ చేసావే’ వైపే మొగ్గు చూపారు. ఆ సినిమానే తనకు కెరీర్ ఇచ్చిందని, అది లేకపోతే ‘ఈగ’ లాంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చేవి కావని క్లారిటీ ఇచ్చారు.

'రంగస్థలం', 'ఓ బేబీ'లకే ఓటు వేసిన సామ్:

ప్రశ్నలు కొనసాగుతూ.. ‘ఓ బేబీ’ లేదా ‘అ ఆ’ అని అడగగా ఆమె ‘ఓ బేబీ’ని ఎంచుకున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘యశోద’ లేదా ‘రంగస్థలం’ లలో దేన్ని ఇష్టపడతారని అడిగితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన ‘రంగస్థలం’ చిత్రానికే సమంత ఓటు వేశారు. ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే ‘సిటాడెల్’ కంటే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వైపే మొగ్గు చూపారు.

'ఫ్యామిలీ మ్యాన్' ని కాదని మళ్ళీ 'ఏ మాయ చేసావే':

అయితే అసలైన ట్విస్ట్ చివర్లో ఎదురైంది. సమంతకు భారీ గుర్తింపు తెచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లేదా ఆమె మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’ లో ఏది బెస్ట్ అని హోస్ట్ అడిగారు. దానికి కూడా సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమానే ఎంచుకున్నారు. "ఆ సినిమా లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, అది నా జీవితాన్ని మార్చేసింది" అంటూ తన డెబ్యూ మూవీపై ఉన్న స్పెషల్ బాండ్ ను బయటపెట్టారు.

నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో:

సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు సమంత భర్త రాజ్ నిడిమోరు దర్శకుడు కాగా.. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో ఆమె మాజీ భర్త నాగచైతన్య హీరోగా నటించారు. అయినప్పటికీ, సమంత వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి.. తన సినీ ప్రయాణానికి పునాది వేసిన మొదటి చిత్రానికే పెద్ద పీట వేయడం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది...

చివరగా చెప్పాలంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో. సమంత నేడు పాన్-ఇండియా స్టార్‌గా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొదటి సినిమాను, ఆ పాత్రను గుండెల్లో దాచుకుందని ఈ ఇంటర్వ్యూతో ప్రూవ్ అయింది. మరి జూన్ 19న రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో చూడాలి!

Tags:    

Similar News