సమంత రూ.100 కోట్ల బ్రాండ్‌గా ఎలా మారింది ? ఇదే అసలు పవర్!
సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ అయిన సమంత క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ అయిన సమంత క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం సినిమాలే కాదు.. బిజినెస్ వెంచర్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆమె ఏకంగా రూ.100 కోట్లకు పైగా సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. కేవలం ఒక నటిగానే కాకుండా ఒక పవర్‌ఫుల్ బ్రాండ్‌గా ఎదిగిన సామ్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. లేటెస్ట్‌గా ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్, సంపాదన మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
అసలు సీక్రెట్ ఇదే:
సమంతకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 నుండి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక స్పెషల్ సాంగ్స్ కోసం అయితే రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేసింది. దీనికి తోడు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ ఏడాదికి రూ.8 కోట్ల దాకా వెనకేస్తోంది. ఇక ఓటీటీ ప్రాజెక్టులకైతే ఏకంగా రూ.10 కోట్ల వరకు అందుకుంటూ తన రేంజ్ ఏంటో చూపిస్తోంది.
కోట్లాది రూపాయల ఇళ్లు.. రియల్ ఎస్టేట్ పవర్:
సమంతకు లగ్జరీ ఇళ్లంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌లోని ప్రముఖ జూబ్లీహిల్స్ ఏరియాలో రూ.80 కోట్ల విలువైన భారీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఆమెకు ఉంది. ఇక ఇది కాకుండా ముంబైలో సముద్రం కనిపించే ఒక అందమైన అపార్ట్‌మెంట్ అది సుమారు రూ.15 కోట్లు, హైదరాబాద్‌లోనే మరో రూ.8 కోట్ల డూప్లెక్స్ హౌస్ కూడా ఉన్నాయి.
గ్యారేజీలో మెరిసే క్రేజీ కార్లు:
సామ్ కార్ల కలెక్షన్ కూడా చాలా రాయల్‌గా ఉంటుంది. ఆమె గ్యారేజీలో రూ.2.55 కోట్ల విలువైన మెర్సిడెస్ G63 AMG ఉంది. ఇక దాంతో పాటు రూ.2.26 కోట్ల రేంజ్ రోవర్ వోగ్, రూ.1.46 కోట్ల పోర్షే కేమాన్ GTS, అలాగే రూ.1.40 కోట్ల విలువైన BMW 7 సిరీస్ లాంటి ఖరీదైన కార్లు ఆమె స్టైల్, పవర్‌కు నిదర్శనంగా నిలుస్తాయి.
త్వరలోనే 'మా ఇంటి బంగారం' సందడి:
ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ హార్ట్ టచింగ్ సినిమాను సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించడం విశేషం. ఇక జూన్ 19న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
సమంత కేవలం గ్లామర్ నటి మాత్రమే కాదు, మైండ్ ఉన్న బిజినెస్ ఉమెన్ కూడా. తన టాలెంట్, కష్టం, సరైన ప్లానింగ్‌తో ఇండస్ట్రీలో ఒక తిరుగులేని బ్రాండ్‌గా మారింది. లైఫ్‌లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురొడ్డి నిలిచి, రూ.100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సమంత నిజంగానే ఒక సూపర్ ఉమెన్ అని చెప్పాలి.