సల్మాన్ ఖాన్ తో సమంతకు ఛాన్స్!
సల్మాన్ ఖాన్ - సమంత ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తోంది.;
సల్మాన్ ఖాన్ - సమంత ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే ఓ సూపర్ హీరో చిత్రాన్ని ప్లాన్ చేస్తు న్నారు. ఇప్పటికే కథ వినిపించగా? సల్మాన్ ఒకే చేసారు. అయితే ఆ కథలో కొన్ని మార్పులను సూచించారు. వాటన్నింటి పూర్తి చేసి పట్టాలెక్కించాలని దర్శకద్వయం ప్లాన్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సమంతను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదే నిజమైతే? సమంతకు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఎంట్రీ ఇదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమంతకు, రాజ్ అండ్ డీకేలకు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి దర్శకత్వంలో రిలీజ్ అయిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్‌తో సమంత నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. `రాజీ` పాత్రలో సమంత నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటుపై వీరితోనే కలిసి `సిటాడెల్: హనీ బన్నీ` అనే మర భారీ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. సమంతలోని నటన, డెడికేషన్ దర్శక ద్వయానికి బాగా నచ్చింది.
ఈ నేపథ్యంలో సమంత -రాజ్ నిడిమోరు తో మరింత స్నేహాన్ని కొనసాగించి పెళ్లి వరకూ తీసుకెళ్లింది. ఇటీవలే వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సమంతను కాదని రాజ్ నిడిమోరు మరో నాయిక వైపు ఎలా చూస్తాడు? సమంత బాలీవుడ్ లో సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో ఆశపడుతోంది. ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. సమంత కంటే వెనకెళ్లిన వాళ్లకు అవకాశాలు వచ్చాయిగానీ సామ్ కి మాత్రం ఛాన్స్ రాలేదు. ఈనేపథ్యంలో భర్త డైరెక్ట్ చేసే సినిమాలోనైనా సామ్ ఛాన్స్ అందుకోకపోతే ఎలా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గ్లామర్‌కే పరిమితం కాకుండా ప్రాధాన్యత ఉండేలా రాజ్ అండ్ డీకే కథను సిద్ధం చేస్తుంటారు. సమంతకు బాలీవుడ్‌లో బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మొదలైన క్రేజ్ నేపథ్యంలో సల్మాన్ లాంటి సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సామ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సౌత్ భామలు హిందీలో జెండా పాతేస్తున్న సమయంలో సమంత-సల్మాన్ కాంబో ట్రేడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారనుంది. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ దక్కినట్లే. రాజ్ అండ్ డీకే స్టైల్ స్టోరీ టెల్లింగ్‌లో సల్మాన్ స్వాగ్, సమంత పర్ఫార్మెన్స్ చూడాలని అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.