సమంత హస్బెండ్ తో స‌ల్మాన్ భాయ్ బిగ్ ప్లాన్

బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-06 04:28 GMT

బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న‌ చిత్రంగద సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇది వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇది ఇండియా-చైనా బార్డ‌ర్ గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన బాహాబాహీ యుద్ధం ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రం 17 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల కానుంది.

ఇటీవ‌లే విడుద‌లైన బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ టీజ‌ర్ కొన్ని విమర్శ‌ల‌తో పాటు, ప్ర‌శంస‌లను అందుకుంది. స‌ల్మాన్ భాయ్ ని ఈ సినిమాలో స‌రికొత్త కోణంలో చూడ‌బోతున్నామ‌ని కూడా టీజ‌ర్ రివీల్ చేసింది. అయితే స‌ల్మాన్ భాయ్ ఈ సినిమా త‌ర్వాత ఎవ‌రితో ప‌ని చేస్తారు? అనేదానిపై ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. తాజా స‌మాచారం మేర‌కు.. ఫ్యామిలీమ్యాన్ సృష్టిక‌ర్త‌లు రాజ్ అండ్ డీకే స‌ల్మాన్ కోసం అదిరిపోయే యాక్ష‌న్ కామెడీ స్క్రిప్టును రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే స‌ల్మాన్ కి లైన్ వినిపించి ఓకే చేయించుకున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్టుపై ప‌ని చేస్తున్నార‌ని స‌మాచారం.

అంతా స‌వ్యంగా కుదిరితే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివ‌రిలో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా స‌ల్మాన్ స్క్రిప్టును ఫైన‌ల్ చేయ‌లేదు. రాజ్ అండ్ డీకేతో ప‌లుమార్లు స్క్రిప్టుపై చ‌ర్చించాకే దీనికి ఓకే చెప్పే అవ‌కాశం ఉంది. బౌండ్ స్క్రిప్టు ప్ర‌తిదీ డిసైడ్ చేస్తుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

ఒక‌వేళ ఈ ప్రాజెక్ట్ ఖ‌రారైతే బ‌హుశా స‌ల్మాన్ కెరీర్ లోనే ఇది పూర్తి వైవిధ్య‌మైన సినిమా అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రాజ్ అండ్ డీకే ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే తో పాటు అండ‌ర్ డాగ్ హీరోయిజాన్ని స‌ల్మాన్ లో చూడొచ్చు. ఇక స‌ల్మాన్ బాడీ లాంగ్వేజ్ లో ఉన్న మాస్ అంశాల‌ను మిస్ చేయ‌కుండానే ఇందులో యాక్ష‌న్, కామెడీ, థ్రిల్స్ ని అందించాల‌ని రాజ్ అండ్ డీకే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఫ్యామిలీమ్యాన్ 3 వెబ్ సిరీస్ ఇటీవ‌ల ఓటీటీలో విడుదలై గొప్ప ప్ర‌జాద‌ర‌ణ పొందుతోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఫెయిల్యూర్ అన్న‌దే లేకుండా అజేయంగా ముందుకు సాగుతున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే, రాజ్ నిడిమోరు 1డిసెంబర్ 2025న కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ భూత శుద్ధి వేడుకలో నటి సమంత రూత్ ప్రభును వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట విదేశాల‌లో హ‌నీమూన్ ని ఎంజాయ్ చేస్తోంది.


Tags:    

Similar News