డ‌ర్టీ గేమ్స్: ఎం.ఎస్.ధోని వ‌ర్సెస్ స‌ల్మాన్

ఇద్దరు డ‌ర్టీ బోయ్స్ బుర‌దలో ఆట‌లాడుతున్నారు. ఒక‌రు వినోదరంగం నుంచి డ‌ర్టీ బోయ్.;

Update: 2025-12-25 05:27 GMT

ఇద్దరు డ‌ర్టీ బోయ్స్ బుర‌దలో ఆట‌లాడుతున్నారు. ఒక‌రు వినోదరంగం నుంచి డ‌ర్టీ బోయ్. మ‌రొక‌రు క్రికెట్ ఆట‌లో డ‌ర్టీబోయ్. ఇద్ద‌రూ హార్డ్ హిట్ట‌ర్లే. అందుకే బుర‌ద‌లో ఆడే ఈ ఆట‌లో గెలుపెవ‌రిది? అంటూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. ఇంత‌కీ ఈ ఆట స్థ‌లం ఎక్క‌డ‌? అంటే ముంబై ఔట‌ర్ లోని ప‌న్వేల్ ఫామ్ హౌస్. స‌ల్మాన్ ఖాన్ రెగ్యుల‌ర్ గా ఇక్క‌డే ఆట‌లాడుతూ ఉంటాడు. అత‌డికి తోట‌లో ఆట‌లు అంటే చాలా ఇష్టం. అందుకే న‌గ‌రాన్ని విడిచిపెట్టి, ఫామ్ హౌస్ లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాడు. ఆక్సిజ‌న్ క‌రువైన న‌గ‌ర జీవితానికి సాంత్వ‌న చేకూర‌డానికి తోట‌లో ఆట‌లే ఆలంబ‌న‌.

ఇప్పుడు భాయ్ తో ధ‌నాధ‌న్ ధోని కూడా క‌లిస్తే సంద‌డి ఎలా ఉంటుందో ఈ ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. క్రికెట్ -సినిమా రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల మ‌ధ్య గేమ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ గేమ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్క‌డ బాగా ఎత్తు ప‌ల్లాలు ఉండే నేల‌ను దుక్కి దున్నాలి. దానికోసం ట్రాక్ట‌ర్ ని ఉప‌యోగించుకోవ‌చ్చు. నేల అంతా త‌డిసి ఉన్న‌ప్పుడు ట్రాక్ట‌ర్ కి దుక్కి నాగ‌లిని త‌గిలించి ఆడే ఆట‌లో స‌ల్మాన్ వ‌ర్సెస్ ఎంఎస్ ధోని ర‌క్తి క‌ట్టించారు. ఈ ఆస‌క్తిక‌ర ఆట‌కు సంబంధించిన‌ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫామ్ హౌస్ లో ఇద్ద‌రు మిత్రుల ఆట‌ల‌కు సంబంధించిన ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. స‌ల్మాన్ - ఎంఎస్ ధోని పొలాల్లో పనిని ఎంతాగా ఆస్వాధిస్తారో ఈ ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. మ‌నిషి స‌హ‌జ‌సిద్ధ‌మైన జీవ‌నానికి దూరంగా మాన‌సికంగా అల‌సిపోతున్నాడు. కాస్తంత సేద దీర‌డానికి సాంత్వ‌న చెంద‌డానికి ఇలా బుర‌దలో స్వేచ్ఛ‌గా ఎంజాయ్ చేయాలి ఎవ‌రైనా. పొలంలో వ్యవసాయం చేస్తుంటే, కాయ‌క‌ష్టం చేస్తుంటే, అల‌స‌ట‌తో చెమ‌ట‌లు కక్కితే ఆ త‌ర్వాత ప‌ట్టే నిదురే అస‌లైన‌ సుఖ‌నిద్ర‌. ఒంటికి కాస్తంత బుర‌ద‌ప‌ట్టి మురికిగా మారాక దానిని పోగొట్టేందుకు ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో స్నాన‌మాడి నిదురిస్తే ప‌ట్టే నిదురే వేరు. స‌ల్మాన్ భాయ్- ధోని ఇలాంటి జీవితాన్ని చ‌క్క‌గా ఆస్వాధిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ ఆట‌లోకి ప్రముఖ గాయకుడు ఏపీ ధిల్లాన్ కూడా చేరాడు. అత‌డు కూడా పాట‌లు మానేసి బుర‌ద ఆట‌లోకి దిగాడు.

ఒళ్లంతా బుర‌ద పులుముకుని, దానిని కూడా ఆస్వాధించ‌డానికి నిజంగా ఒక రైతుకు ఉండాల్సిన మ‌న‌సు ఉండాలి. స‌ల్మాన్- థిల్లాన్- ధోని ఆ ముగ్గురికి ఆ మ‌నసు ఉంది గ‌నుక‌నే ఈ ఫ్రేమ్ సాధ్య‌మైంది. ప్రేక్ష‌కులు ఆ ముగ్గురినీ ఇలా చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆస‌క్తిక‌రంగా ఎం.ఎస్.ధోని ఇంత‌కుముందు సినీనిర్మాత‌గా మారాడు. ఒక సినిమాని కూడా నిర్మించాడు. మునుముందు స‌ల్మాన్ భాయ్ క‌థానాయ‌కుడిగా ఏదైనా సినిమాని నిర్మిస్తాడా? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News