స‌ల్మాన్‌ఖాన్‌కి దిల్ రాజు ఎంతిస్తున్నారు?

గ‌త మూడేళ్లుగా స్టార్స్ ఎవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో సినిమాలకు దూరంగా ఉంటూ వ‌చ్చారు టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి.;

Update: 2026-03-31 15:30 GMT

గ‌త మూడేళ్లుగా స్టార్స్ ఎవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో సినిమాలకు దూరంగా ఉంటూ వ‌చ్చారు టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. మ‌హేష్‌తో భారీ సినిమాకు ట్రై చేసినా ఫ‌లితం లేక‌పోవ‌డం, అదే స‌మ‌యంలో అల్లు అర్జున్‌, బ‌న్నీ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా మార‌డంతో త‌న‌తో సినిమా చేసే స్టార్ కోసం మూడేళ్లుగా నిరీక్షిస్తూ వ‌స్తున్నాడు. ఫైన‌ల్‌గా టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్స్ ఎవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో బాలీవుడ్ స్టార్‌ని ప‌ట్టేశాడు.

వంశీ పైడిప‌ల్లి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే స్టోరీ న‌రేష‌న్ పూర్తి చేసి ఫైన‌ల్ కాల్ తీసుకున్న వంశీ పైడిప‌ల్లి ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మాణంలో చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తున్న వంశీ పైడిప‌ల్లి ఈ మూవీ కోసం స‌ల్మాన్ ఖాన్‌కు జోడీ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ని రంగంలోకి దించేస్తున్నాడు. అలాగే కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ అనిల్ క‌పూర్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌ల్మాన్ ఖాన్ వంశీ పైడిప‌ల్లి చెప్పిన యాక్ష‌న్‌ స్టోరీ న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌ని చేస్తున్న‌ట్టుగా స‌ల్మాన్ ఖాన్ త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించారు. దిల్, దిమాగ్, జిగ‌ర్ అంటూ ఈ ఏప్రిల్ నుంచి మొద‌ల‌వుతుంద‌ని క‌న్ఫ‌ర్మ్ చేసేశాడు. అయితే ఈ భారీ యాక్ష‌న్ డ్రామాకు స‌ల్మాన్ ఖాన్ రెమ్యున‌రేషన్ ఎంత తీసుకుంటున్నాడు? ఎంత‌కు దిల్ రాజు ఫైన‌ల్ చేయించుకున్నాడు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ మూవీకి స‌ల్మాన్ ఖాన్ రూ.120 కోట్లు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేశార‌ట‌. అయితే ఎలింటి నెగోషియోష‌న్స్, సెకండ్ థాట్‌ లేకుండా వ‌న్ సిట్టింగ్‌లోనే దిల్ రాజు..స‌ల్మాన్ కోట్ చేసిన‌ రెమ్యున‌రేష‌న్‌ని ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. అంతే కాకుండా ఈ మూవీకి `దిల్ దిమాగ్ జిగ‌ర్ సే` అనే టైటిల్‌ని కూడా ఫైన‌ల్ చేసేశార‌ట‌. అయితే స‌ల్మాన్ ఖాన్ ఎంత త్వ‌ర‌గా ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేస్తారు? వంటి క్వొశ్చ‌న్‌ని మాత్ర‌మే దిల్ రాజు టీమ్ రైజ్ చేసింద‌ని, అంత‌కు మించి మ‌రేదీ స‌ల్మాన్ నుంచి డిమాండ్ చేయ‌లేద‌ని ఇన్ సైడ్ టాక్‌.

`సికింద‌ర్‌`ని సౌత్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌. మురుగ‌దాస్ చేయ‌డం తెలిసిందే. భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి మురుగ‌దాస్‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ కు స‌ల్మాన్ పెద్ద‌గా స‌హ‌క‌రించ‌లేద‌ని, షూటింగ్ షెడ్యూల్ గురించి చెబితే త‌న‌కు ఇష్టం వున్న టైమ్‌కు షూటింగ్‌కు వ‌చ్చేవాడ‌ని, చాలా వ‌ర‌కు సీన్‌ల‌ని సీజీలో, డూప్‌తో కానిచ్చామ‌ని స‌ల్మాన్‌ఖాన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌ల్మాన్‌తో దిల్ రాజు, వంశీ పైడిప‌ల్లి ఎలా నెగ్గుకొస్తారో అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News