• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్​, షారుక్​ మధ్యలో...

ప్రభాస్​, షారుక్​ మధ్యలో సూపర్ స్టార్

| తాజాగా ఈ నేరు విడుదల తేదీ ఖారారైంది. డిసెంబర్ 21న రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే సలార్ డిసెంబర్ 22న రానుండగా.. షారుక్​ డంకీ దాదాపుగా అదే సమయంలో రానుంది.

By - Tupaki Desk
Update: 2023-11-02 13:53 GMT

విభిన్నమైన చిత్రాలతో, వైవిధ్యభరితమైన పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు సీనియర్ హీరో మోహన్ లాల్. ప్రతీ చిత్రాన్ని డిఫరెంట్‌గా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ఈ మలయాళ సూపర్ స్టార్​. ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలను చేసిన ఆయన ఈ సారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, బాలీవుడ్ బాద్​ షా షారుక్​ ఖాన్​తో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

వివరాళ్లోకి వెళితే.. ప్రస్తుతం మోహన్​ లాల్ దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో మలైకొట్ట వాలిబన్​, నేరు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు రిలీజ్ డేట్​లను ఖరారు చేసుకున్నాయి. మలైకొట్టా వాలిబన్ వచ్చే ఏడాది జనవరి రిపబ్లిక్​ రోజు విడుదల కానుండగా.. అంతకన్నా ముందు ఈ ఏడాది డిసెంబర్​లో క్రిస్మస్​ కానుకగా నేరు చిత్రం విడుదలకు రెడీ అయింది.

తాజాగా ఈ నేరు విడుదల తేదీ ఖారారైంది. డిసెంబర్ 21న రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే సలార్ డిసెంబర్ 22న రానుండగా.. షారుక్​ డంకీ దాదాపుగా అదే సమయంలో రానుంది. దీంతో కేరళ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు ఉండనుంది. అక్కడ వారికి సలార్​, డంకీ డబ్బింగ్ చిత్రాలే అయినప్పటికీ వీటిపై కూడా మంచి ఆసక్తి నెలకొంది.

ఈ నేరు చిత్రాన్ని దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2, 12 మ్యాన్ వంటి సూపర్ హిట్స్ తర్వాత నాలుగో కలిసి ఈ కాంబో పని చేయడంతో నేరుపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆశీర్వాద్ సినిమాస్​ బ్యానర్​పై చిత్రాన్ని నిర్మించారు. చూడాలి మరి ఈ సినిమా సలార్, డంకీ లాంటి భారీ సినిమాల పోటీని తట్టుకుని ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.

ఇకపోతే మోహన్​ లాల్ నటిస్తున్న 'బరోజ్: గార్డియన్ ఆఫ్ డి'గామా', 'రామ్: పార్ట్ 1' చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. 'ఎంపురాన్', 'వృషభ' చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వృషభ ఏకకాలంలో తెలుగు, మలయాళంలో చిత్రీకరణ జరుకుంటోంది. రీసెంట్​గా రాంబాన్​ అనే సినిమాను కూడా ప్రకటించి ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు మోహన్ లాల్.

Tags:    
  • Movies 
  • Prabhas 
  • Salaar 
  • Salaarmovie 
  • Shahrukhkhan 
  • Dunki 
  • Dunkimovie 
  • Mohanlal 
  • Neru 
  • Nerumovie 
  • Clash 
  • Releasedate 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS