• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ వెయ్యి కోట్లు...

సలార్ వెయ్యి కోట్లు అందుకోవాలంటే అదొక్కటే మార్గం

| డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సలార్

By - Tupaki Desk
Update: 2023-12-25 04:25 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సలార్. ఈ సినిమా మొదటి రోజు నుంచి కలెక్షన్స్ పరంగా పరుగులు పెడుతోంది. ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ ని సలార్ మూవీ అందుకుంది. రెండో రోజు కూడా 117 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. ఆదివారం కూడా కలెక్షన్స్ వంద కోట్లు దాటిపోయాయని తెలుస్తోంది.

క్రిస్మస్ ఫెస్టివల్ ఉండటంతో సోమవారం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. వీకెండ్ లో ఎంత ప్రభావం చూపిస్తోంది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ పరంగా అంతే స్థాయిలో ప్రభావం చూపించి ఆడియన్స్ ని సలార్ మూవీ థియేటర్స్ కి రప్పించాల్సి ఉంటుంది. ఈ ఇంపాక్ట్ సలార్ మూవీ కలెక్షన్స్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడంలో కీలకం అవుతుంది.

ఇక సౌత్ నుంచి ఇప్పటి వరకు వెయ్యి కోట్లకిపైగా కలెక్షన్స్ అందుకన్న సినిమాలు అంటే బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్2, ఆర్ఆర్ఆర్. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉన్నాయి. వెయ్యి కోట్లు కలెక్షన్స్ ని ఈ చిత్రాలు అందుకోవడానికి బాలీవుడ్ మార్కెట్ కూడా కారణం అని చెప్పాలి. సౌత్ లో ఈ సినిమాలు ఎంత సత్తా చాటాయో అంతే స్థాయిలో నార్త్ లో కూడా ప్రభావం చూపించాయి.

బాహుబలి 2 మూవీ అయితే హిందీ బెల్ట్ లో 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. తరువాత కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా 435 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ కూడా 275 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ ఆయా సినిమాలు వెయ్యి కోట్లకి పైగా మార్క్ ని దాటడానికి సహకరించాయి. ఈ ఏడాదిలో వచ్చిన జవాన్, పఠాన్ సినిమాలు వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించడానికి హిందీ బెల్ట్ కారణం.

అలాగే జైలర్, లియో మూవీస్ వెయ్యి కోట్లని టచ్ చేయలేకపోవడానికి కారణం కూడా హిందీ మార్కెట్. అక్కడ ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో సౌత్ సినిమా వెయ్యి కోట్లు దాటి వసూళ్లు చేయాలంటే మాత్రం కచ్చితంగా హిందీ మార్కెట్ లో మంచి సక్సెస్ అందుకొని కలెక్షన్స్ పరంగా బలమైన ప్రభావం చూపించాలి. లేదంటే సలార్ వెయ్యి కోట్లుఅందుకోవడం కష్టమైపోతుంది. ప్రస్తుతం సలార్ మీద నార్త్ లో విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దానిని తట్టుకొని సలార్ నిలబడుతుందా అనేది చూడాలి.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prashanthneel 
  • Shrutihaasan 
  • Salaarcollections 
  • Salaarmovie 
  • Filmindustry 
  • Bahubali2 
  • RRR 
  • KGF2 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS