సలార్2 పై అంచనాలు పెంచేసిన వరదరాజ మన్నార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగులో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ.800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి మంచి హిట్ గా నిలిచింది. అయితే సలార్ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి అందరికీ తెలుసు.
సలార్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో సలార్2 పై అందరికీ మంచి అంచనాలున్నాయి. సలార్ 2 శౌర్యంగ పర్వం అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సలార్ సినిమాలో వరద రాజమన్నార్ అనే పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా సర్జమీన్ ప్రమోషన్స్ లో సలార్2 గురించి మాట్లాడారు.
సలార్ సీక్వెల్ గా రానున్న శౌర్వంగపర్వం మొదటి భాగం కంటే చాలా భారీగా, బెటర్ గా ఉంటుందని పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా, ఎప్పుడు ప్రభాస్ తో కలిసి స్క్రీన్ పై పోటీ పడతానా అని ఆతృతగా ఉందని పృథ్వీరాజ్ చెప్పారు. దీంతో ఇప్పుడు సలార్2 పై అందరికీ మరిన్ని అంచనాలు పెరిగాయి.
అయితే ఇండియన్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా రానున్న సలార్2 సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త టైమ్ పట్టేట్టుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, ఆ సినిమా తర్వాత సలార్2 పనుల్ని మొదలుపెట్టనున్నారు. ఈ లోపు ప్రభాస్ కూడా తన కమిట్‌మెంట్స్ ను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగాతో సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్పిరిట్ ను మొదలు పెట్టనున్నారు. ఇవన్నీ పూర్తయ్యాకే సలార్2 సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.