ఆ స్టార్ హీరో త‌ర్వాత అంధుడిగా మ‌రో స్టార్!

బాలీవుడ్ నుంచి మాత్రం హృతిక్ రోష‌న్ ఈ లిస్ట్ లో ముందు వ‌రుస‌లో ఉంటాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2024-05-10 14:30 GMT

వెండి తెర‌పై అద్భుతాలు చేయ‌డం అన్న‌ది కొంద‌రి స్టార్ హీరోల‌కే సాధ్యం. పాత్ర ఎలా ఉన్నా? ఆహార్యం ఎలాంటిదైనా పోషించ‌గ‌లిగే వారు కొంద‌రు మాత్ర‌మే. కొన్నిసార్లు రిస్క్ పాత్రలే తార స్థాయికి తీసుకెళ్తుంటాయి. డిఫ‌రెంట్ అటెంప్ట్ లే అగ్ర స్థానంలో నిలెబ‌డ‌తాయి. కోలీవుడ్ నుంచి ధ‌నుష్‌..విక్ర‌మ్..సూర్య...క‌మ‌ల్ హాస‌న్ లాంటి న‌టులు మాత్రం అలాంటి డేరింగ్ నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌రు. బాలీవుడ్ నుంచి మాత్రం హృతిక్ రోష‌న్ ఈ లిస్ట్ లో ముందు వ‌రుస‌లో ఉంటాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


ఆయ‌న 'కాబిల్' చిత్రంలో అధుడి పాత్ర తో ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా ద‌గ్గ‌ర‌య్యారో తెలిసిందే. అంధుడి పాత్ర‌లో హృతిక్..యామీ గౌత‌మి న‌ట‌న‌ల విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిపించింది. ఎమోష‌న‌ల్ గా ఆ సినిమా ఎంతో మందికి క‌నెక్ట్ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ నుంచి అంధుడి పాత్ర‌లో న‌టించ‌డానికి మ‌రో న‌టుడు సిద్ద‌మ‌య్యాడు. అత‌డే సైఫ్ అలీఖాన్. ఓ థ్రిల్లింగ్ క‌థాంశంతో ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న చిత్రంలో సైఫ్ అంధుడి పాత్ర‌లో న‌టించ‌డానికి సైన్ చేసారు.

Read more!

వాస్త‌వానికి ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు బాలీవుడ్ పేరున్న మ‌రికొంత మంది న‌టుల‌కు వినిపించారుట‌. కానీ ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదుట‌. చివ‌ర‌కు సైఫ్ అలీఖాన్ ఆ పాత్ర‌కు కనెక్ట్ అయి తాను మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పాడుట‌. దీంతో ప్రియ‌దర్శ‌న్ సైఫ్ తో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. ఈ పాత్ర‌తో సైఫ్ అలీఖాన్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌స్తుంద‌ని అంటున్నారు. పాత్ర బాగుంటే హీరో అయినా..విల‌న్ అయినా ఒకే అంటారాయ‌న.

ప్ర‌స్తుతం 'దేవ‌ర‌'లో విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు 'ఆదిపురుష్' లో లంకేశ్వ‌రుడి పాత్ర‌లోనూ న‌టించారు. హీరోగా ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన న‌టుడీయ‌న‌. అంధుడి పాత్ర తో సైఫ్ అలీఖాన్ మ‌రింత ప్ర‌త్యేకంగా ఫోక‌స్ అవుతారు. అలాగే తెలుగులో అంధుడి పాత్ర‌లో మాస్ రాజా ర‌వితేజ కూడా న‌టించాడు. అదే 'రాజా ది గ్రేట్' అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News