• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి ధరమ్ తేజ్ 'బ్రో' తో...

సాయి ధరమ్ తేజ్ 'బ్రో' తో లాస్ట్‌..!

| తాజాగా బ్రో సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ

By - Tupaki Desk
Update: 2023-07-26 05:45 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో రెండు రోజుల్లో 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మామయ్య పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్‌ నటించాడు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా రూపొందిన 'బ్రో' సినిమా లో సాయి ధరమ్ తేజ్ లుక్ మరియు పాత్ర ఆకట్టుకోబోతున్నాయట.

తాజాగా 'బ్రో' సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఇకపై నేను ఏ సినిమాని రీమేక్ చేయాలని అనుకోవడం లేదు. ఇతర భాషల సినిమాలను మాత్రమే కాకుండా మామయ్యలు చిరంజీవి... పవన్‌ కళ్యాణ్ ల సినిమాలను కూడా రీమేక్ చేసే ఆలోచన లేదని తెలియజేశాడు.

రీమేక్ చేయాలంటే ఓ విభిన్నమైన స్టైల్ ఉండాలి... బాడీ లాంగ్వేజ్ ఉండాలి. నేను రీమేక్ లకు సెట్‌ అవ్వను అనేది నా అభిప్రాయం. అందుకే పవన్‌ కళ్యాణ్‌ గారి సినిమాలు మాత్రమే కాకుండా ఏ ఇతర హీరోల సినిమాలను రీమేక్ చేయాలని నేను అనుకోవడం లేదు అంటూ సాయి ధరమ్‌ తేజ్ పేర్కొన్నాడు.

ఒక వైపు పవన్ కళ్యాణ్... చిరంజీవితో పాటు పలువురు హీరోలు రీమేక్‌ లు చేస్తూ దూసుకు పోతూ ఉన్నా కూడా సాయి ధరమ్ తేజ్ మాత్రం రీమేక్ లు చేయను.. బ్రో సినిమానే తన చివరి రీమేక్ సినిమా అన్నట్లుగా పేర్కొన్నాడు. తేజ్ ఇదే మాటపై నిలుస్తాడా లేదంటే ముందు ముందు మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రీమేక్ తన వద్దకు వస్తే ఆలోచన ఏమైనా మార్చుకుంటాడా అనేది చూడాలి.

సాయి ధరమ్‌ తేజ్ గత చిత్రం విరూపాక్ష భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. బ్రో సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. బ్రో సినిమా రిలీజ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చిన్న బ్రేక్‌ తీసుకోబోతున్న విషయం తెల్సిందే.

Tags:    
  • RemakeMovie 
  • PawanKalyan 
  • BROMovie 
  • SaiDharamTej 
  • BRO 
  • KetikaSharma 
  • PriyaPrakash 
  • Samuthirakani 
  • BROFilm 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS