ఐతే తేజ్ తప్పుకున్నట్టేగా..?

ఐతే లాస్ట్ ఇయర్ సినిమా ఫస్ట్ టీజర్ టైం లోనే 2025 దసరాకి ఈ సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు.;

Update: 2025-07-03 03:00 GMT

మెగా మేనల్లుడు సాయి తేజ్ బ్రో సినిమా తర్వాత సంబారాల యేటి గట్టు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రోహిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రోజే ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. తేజ్ తో ఒక మాస్ యాక్షన్ అది కూడా పీరియాడికల్ కథతో తీసుకొస్తుండటంతో సినిమాపై బజ్ పెరిగింది. ఈ మూవీలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్ గా లాక్ చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఉంది అంటే కథానాయిక పాత్రకు కూడా చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది.

ఐతే లాస్ట్ ఇయర్ సినిమా ఫస్ట్ టీజర్ టైం లోనే 2025 దసరాకి ఈ సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా అప్డేట్ ఇవ్వలేదు సరికదా రిలీజ్ అనుకున్న దసరాకి కూడా వస్తుందా రాదా అన్న డౌట్ మొదలైంది. ఐతే ఆల్రెడీ దసరా బరిలో బాలయ్య అఖండ 2 సినిమా రిలీజ్ కన్ ఫర్మ్ చేశారు. అఖండ 2 సినిమాను బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య అఖండ 2 దసరా రిలీజ్ అవుతుండగా ఆ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా దసరాకి రిలీజ్ కన్ ఫర్మ్ అంటున్నారు. రీసెంట్ గా ఓజీ వాయిదా పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. సెప్టెంబర్ 25 రిలీజ్ ఫిక్స్ అని మరోసారి చెప్పారు. సో అఖండ 2, ఓజీ దసరాకి రిలీజ్ కి దిగుతున్నాయి.

అఖండ 2 ఒక్కటే వస్తే ఏమో కానీ దానితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ వస్తున్నాడు అంటే తేజ్ సినిమా సంబరాల యేటి గట్టు వాయిదా పడినట్టే అని చెప్పొచ్చు. త్వరలోనే తేజ్ మూవీ వాయిదా తో పాటుగా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. సాయి ధరం తేజ్ సంబరాల యేటిగట్టు అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తేజ్ దసరాకి మిస్ అయినా సరే తప్పకుండా మరో మంచి డేట్ కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మామయ్య సినిమా వస్తుంది కాబట్టి తేజ్ దసరాని వదిలి మరో డేట్ కి వస్తాడని తెలుస్తుంది. ఐతే సినిమా షూటింగ్ అప్డేట్స్ కి సంబంధించిన విషయాలను కూడా మేకర్స్ రివీల్ చేయట్లేదు.

Tags:    

Similar News