ఫిట్‌నెస్‌తో హిట్ పాప గ్లామర్ ట్రీట్!

తెలుగు ప్రేక్షకులకు 'HIT' సినిమాతో పరిచయమైన నార్త్ బ్యూటీ రుహాని శర్మ తన నేచురల్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.;

Update: 2025-04-13 06:48 GMT

తెలుగు ప్రేక్షకులకు 'HIT' సినిమాతో పరిచయమైన నార్త్ బ్యూటీ రుహాని శర్మ తన నేచురల్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సినిమాల్లోనే తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకంటే ఎక్కువగా తన లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, ఫోటోషూట్‌లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా అదే తరహాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై నుంచి రుహాని పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో స్టయిలిష్‌గా మెరిసిపోయింది. మిర్రర్ సెల్ఫీ మూడ్‌లో తీసుకున్న ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఫిట్ బాడీ, క్లీన్ స్కిన్, మినిమల్ మేకప్‌తో తానే ఒక ఫిట్‌నెస్ మోడల్‌లా కనిపించింది. ఫొటోకి "లైఫ్ లేట్లీ" అనే క్యాప్షన్ పెట్టి, తన ప్రస్తుత స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ను ఇలా తెలియజేసింది.

రుహాని మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆమెకి మంచి బ్రేక్ 'హిట్'తోనే వచ్చింది. ఆ తర్వాత 'ఆపరేషన్ వాలెంటైన్' వంటి సినిమాల్లో నటించిన రుహాని తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఇంకా బిగ్ లెవెల్ బ్రేక్ మాత్రం రాలేదు. అయినా కూడా రుహాని ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే కనిపిస్తుంది.

ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపే ఈ బ్యూటీ.. తరచూ జిమ్ లుక్‌లు, యోగాసన ఫోటోస్, డాన్స్ రీల్స్‌తో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తాజా ఫోటోల్లోనూ అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. క్లాసీగా కనిపించడంతో పాటు యూత్‌ఫుల్ వైబ్‌ను కూడా అందించింది. ఫ్యాషన్‌తో పాటు తన న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి ఫోటోలు చూస్తే రుహాని కొత్తగా ఓ లవ్ స్టోరీ మూవీ లేదా యూత్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్‌లో కనిపిస్తే సూపర్బ్ ఫిట్ అవుతుందనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె కొన్ని తమిళ సినిమాలకూ కమిట్ అయిందని సమాచారం. ఈ మిడిల్ రేంజ్ బ్యూటీకి తగిన అవకాశాలు వస్తే, మరో న్యాచురల్ స్టార్ అవడం ఖాయమనే అభిప్రాయం నెటిజన్లలో నెలకొంటోంది.

Tags:    

Similar News