'మాకు అదే ముఖ్యం'.. కరుప్పు డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కరుప్పు సినిమా విడుదల తర్వాత వచ్చిన విమర్శలకు దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ తనదైన శైలిలో స్పందించారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కరుప్పు సినిమా విడుదల తర్వాత వచ్చిన విమర్శలకు దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ తనదైన శైలిలో స్పందించారు. మూవీ సక్సెస్ ను పక్కనపెట్టి కొందరు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, తమకు మెయిన్ ఆడియన్స్ రెస్పాన్స్ అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కరుప్పు సినిమా కోసం తాను మూడేళ్లకు పైగా కష్టపడ్డానని ఆర్జే బాలాజీ తెలిపారు. కథ రాయడం నుంచి తెరకెక్కించడం వరకు ఎంతో కష్టపడ్డానని చెప్పారు. సినిమా విజయం సాధించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నిర్మాత కుటుంబంతో కలిసి గుడికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. "నా కష్టం లేకపోయి ఉంటే నిర్మాత అంత సంతోషంగా నా వెంట వచ్చేవారు కాదు" అంటూ తన రోల్ ఎంత కీలకమో పరోక్షంగా చెప్పుకొచ్చారు.
సినిమా విడుదల సందర్భంగా ఎదురైన వివాదాలపై కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. కొందరు సినీ సెలబ్రిటీలు మూవీపై చేసిన కామెంట్స్ ను ఉద్దేశిస్తూ, "వాళ్లు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నిర్మాతే నాకు కాల్ చేసి ప్రశ్నించారు" అని తెలిపారు. అయితే ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్జే బాలాజీ అభిప్రాయపడ్డారు.
తాను దర్శకుడిగా, రచయితగా, నటుడిగా సినిమాను అత్యంత నిజాయితీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చానని ఆర్జే బాలాజీ అన్నారు. సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా తన వంతు బాధ్యత పూర్తిగా కంప్లీట్ చేశానని చెప్పారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నారని, హీరో సూర్య కూడా రిజల్ట్ పై ఆనందంగా ఉన్నారని వెల్లడించారు. మొత్తం మూవీ టీమ్ అంతా సక్సెస్ మోడ్ లో ఉందని తెలిపారు.
అలాగే కొందరు వ్యక్తులకు సినిమా నచ్చిందా లేదా అనేది తమకు ముఖ్యమేమీ కాదని స్పష్టం చేశారు. "అముక్కి నచ్చిందా? ఇంకొకరికి నచ్చిందా? అనే దానికంటే ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నది అసలు విషయం" అని వ్యాఖ్యానించారు. చివరికి సినిమా చూసే ప్రేక్షకులే ఫైనల్ తీర్పు చెబుతారని, అదే తాము గౌరవించే నిర్ణయమని చెప్పారు. తమపై విమర్శలు చేసిన వారు పెద్దవారేనని, వాళ్లకు తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని కూడా ఆర్జే బాలాజీ పేర్కొన్నారు.
అయితే ఆ అభిప్రాయాల కంటే నిర్మాతల సాటిస్ఫికేషన్, ప్రేక్షకుల రెస్పాన్స్ తమకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయని చెప్పారు. నిర్మాతలు లాభాలు పొందారని, తాము పెట్టిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని తెలిపారు. సినిమా కోసం తాను చేయాల్సిన పని నిజాయితీగా చేశానని, దానికంటే ఎక్కువగా ఇంకేం చేయలేనని ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చారు.
రిజల్ట్ తమకు పాజిటివ్ గా వచ్చిందని, అందుకే తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. సినీ వరల్డ్ లో ఎప్పుడూ విమర్శలు, ప్రశంసలు రెండూ సహజమే. అయితే చివరికి ప్రేక్షకుల రెస్పాన్స్ మాత్రమే ఒక మూవీ సక్సెస్ ను డిసైడ్ చేస్తుంది. అదే విషయాన్ని ఆర్జే బాలాజీ మరోసారి గుర్తు చేస్తూ.. పర్సనల్ కామెంట్స్ కన్నా ప్రజల ప్రేమ గొప్పదని తన రెస్పాన్స్ ద్వారా చెప్పకనే చెప్పారు.