హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న మిరాయ్ బ్యూటీ..బొమ్మలా ఉంది బ్రో!
తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో కట్ వర్క్ గోల్డెన్ కలర్ సారీ ధరించిన ఈమె దీనికి ఆపోజిట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది.;
కొత్త నీరు వస్తే పాత నీరు పోయినట్టుగా ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త హీరోయిన్లు వచ్చారు అంటే.. పాత హీరోయిన్ లకి పెద్దగా స్కోప్ ఉండదు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆ కొత్త హీరోయిన్లు మాత్రం తమ నటనతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రూవ్ చేసుకుంటే మాత్రం కుర్రాళ్ళ క్రష్ అయిపోతారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఒక నటి తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అంతేకాదు ఈమెను చూసిన వారంతా బొమ్మలా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమె అందానికి మంత్రముగ్ధులవుతూ ఈమెపై పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఆమె ఎవరో కాదు రితిక నాయక్.. ఇటీవల కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన చిత్రం మిరాయ్. సూపర్ యోధ పాత్రలో వచ్చిన ఈ సినిమాలో రితిక హీరోని ఒక లక్ష్యం కోసం ముందుకు నడిపించే పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది రితిక. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిపోయింది. అందులో భాగంగానే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో కట్ వర్క్ గోల్డెన్ కలర్ సారీ ధరించిన ఈమె దీనికి ఆపోజిట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది. సింపుల్ జ్యూవెలరీతో తన అందాన్ని ఫుల్ ఫిల్ చేసింది అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇందులో ఈమె తన అందంతో అభిమానులను ఆకట్టుకోవడమే కాదు ఈమె ఫోటోలు చూసి బొమ్మలా ఉంది బ్రో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రితిక నాయక్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రితిక నాయక్ విషయానికి వస్తే.. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 టైటిల్ ని గెలుచుకున్న ఈమె ఆ తర్వాత మోడల్ రంగంలోకి అడుగు పెట్టింది. 2022లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోక్ వనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు సినిమాతో తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మధ్యలో 'హాయ్ నాన్న' సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఈమె 'డ్యూయెట్' సినిమాతో అటు తమిళ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది.