బెస్ట్ టైమ్.. టీమ్ తో సందడి చేస్తున్న ది రాజాసాబ్ బ్యూటీ!
ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న రిద్దీ కుమార్.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారి చేస్తున్న హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీ ది రాజాసాబ్ లో నటిస్తోంది.;
ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న రిద్దీ కుమార్.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారి చేస్తున్న హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీ ది రాజాసాబ్ లో నటిస్తోంది. ఈమె తోపాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను చిత్రీకరించడానికి చిత్ర బృందం మొత్తం యూరోప్ కి వెళ్లిన విషయం తెలిసిందే.
చిత్ర బృందంతో పాటు రిద్దీ కుమార్ కూడా అక్కడే ఉండిపోయింది. ఇకపోతే పాటల చిత్రీకరణలో భాగంగా వెళ్లిన టీం తమ పని ముగించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అందరూ కలిసి గ్రాండ్గా పార్టీ జరుపుకున్నట్లు.. ఈ మేరకు చిత్ర బృందంతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను రిద్దీ కుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో పాటు నిర్మాత ఎస్కేయన్ డైరెక్టర్ మారుతి తో సహా పలువురుతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ బెస్ట్ టైం.. రాజా సాబ్ మూవీ టీంతో గడపడం సంతోషంగా ఉంది అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం అక్కడి నుంచి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మహారాష్ట్ర పూణేలో జన్మించిన ఈమె.. తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఈమె తల్లి అల్కా కుమార్.. అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఫెర్గ్యూసన్ కాలేజ్ నుంచి తత్వశాస్త్రంలో బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రిద్ధీ కుమార్ 10వ తరగతి పూర్తయిన నాటి నుంచే డాన్స్ టీచర్ గా, ఈవెంట్ మేనేజర్ గా , యాంకర్ గా పలు రంగాలలో పనిచేస్తూ సత్తా చాటింది.
మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. మిస్ పూణే 2015 టైటిల్ తో పాటూ 2016లో ఫేస్ ఆఫ్ ఇండియా వంటి టైటిల్స్ గెలుచుకుంది. అదే సమయంలో 2018లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన తెలుగు సినిమా లవర్ చిత్రంలో అవకాశం అందుకొని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత తన మాతృభాష మరాఠీ తో పాటు మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇకపోతే అనగనగా ఒక ప్రేమ కథ సినిమాలో విరాజ్ అశ్విన్ సరసన నటించిన రిద్దీ 2019లో వినాయకన్, దిలీష్ పోతన్ లతో కలిసి ' ప్రణయ మీనుకలుడే కాదల్' అనే మలయాళ చిత్రంలో కూడా నటించింది.
అంతేకాదు తెలుగు, హిందీ భాషా చిత్రమైన రాధే శ్యామ్ సినిమాలో కూడా ప్రభాస్ తో కలిసిన నటించిన ఈమె హిందీ వెబ్ సిరీస్ క్రాస్ కోర్స్ లో అన్నుకపూర్ తో కలిసి నటించి మంచి పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.