• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుశాంత్ ని జీవితాంతం మిస్...

సుశాంత్ ని జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను

| తాజాగా రియా చక్రవర్తి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుశాంత్ గురించి స్పందించింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను.

By - Tupaki Desk
Update: 2023-10-06 10:14 GMT

బాలీవుడ్‌ యంగ్ స్టార్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఈ మూడు సంవత్సరాల్లో ఆయన గురించి రెగ్యులర్‌ గా ఏదో ఒక విషయమై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ ప్రియురాలిగా పేరున్న రియా చక్రవర్తి గురించి రెగ్యులర్ గా ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉండటం మనం చూస్తున్నాం.

ముఖ్యంగా సుశాంత్ చనిపోయిన సమయం లోనే రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. జైలుకు వెళ్లడం వంటివి జరిగింది. హీరోయిన్ గా కెరీర్ లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటూ ఉన్న హీరోయిన్‌ రియా చక్రవర్తికి కెరీర్ లో పెద్ద డ్యామేజ్‌ గా సుశాంత్ మరణం నిలిచింది అనడంలో సందేహం లేదు.

సుశాంత్ మరణం కు పూర్తిగా రియా చక్రవర్తి కారణం అన్నట్టుగా చాలా మంది ఆరోపించారు. ఆ సమయంలో రియా చక్రవర్తి కనీసం బయటకు కూడా రాలేక పోయింది. సుశాంత్‌ చనిపోయిన చాలా రోజుల తర్వాత రియా మళ్లీ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్‌ చేయడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా రియా చక్రవర్తి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుశాంత్ గురించి స్పందించింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. ఆ బాధ నుంచి నేను జీవితాంతం బయటకు రాలేను. సుశాంత్ ని నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను.

సుశాంత్ చనిపోయిన సమయంలో చాలా కథనాలు వచ్చాయి. వాటి వల్ల నేను చాలా మిస్ అయ్యాను. కనీసం నేను ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా విమర్శలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ వచ్చాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని నాకు తెలుసు.

ఈ సమయంలో నాకు ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్న ఆదర్శం. ఆయన ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొని నిలవాలని చెప్పేవారు. ఆయన చెప్పినట్లుగానే తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. హీరోయిన్‌ గా రియా చక్రవర్తి పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.

Tags:    
  • Bollywood 
  • Actor 
  • Sushant 
  • Rheachakraborty 
  • Actress 
  • Case 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS