ఐదేళ్ల తర్వాత చేతిలో... హీరోయిన్ ఆనందం!
తెలుగు ప్రేక్షకులకు తునీగా తునీగా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి.;
తెలుగు ప్రేక్షకులకు తునీగా తునీగా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. తెలుగులో ఈమె పెద్దగా సినిమాలు చేయకున్నా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య తర్వాత దేశం మొత్తం ఈమె పేరు పాపులర్ అయింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అనే విషయం చాలా మందికి తెలుసు. దాంతో ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రియా చక్రవర్తిపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రియా చక్రవర్తి స్వయంగా డ్రగ్స్‌ను తెప్పించి సుశాంత్‌కి అలవాటు చేసి, అతడు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించింది అంటూ కేసు కూడా నమోదు అయింది. ఇన్నాళ్లు విచారణ జరిగిన విషయం తెల్సిందే. కేసు విచారణలో ఉన్న కారణంగా రియా చక్రవర్తి ఇన్నాళ్లు మీడియా ముందుకు పెద్దగా రాలేదు, విదేశాలకు వెళ్లే అవకాశం దక్కలేదు.
సోషల్ మీడియాలో రియా చక్రవర్తి
రియా చక్రవర్తి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. రియా చక్రవర్తి సోషల్ మీడియాలో తన ఆనందంను అందరితోనూ పంచుకుంది. ఐదేళ్ల తర్వాత నా పాస్‌పోర్ట్ నా చేతికి వచ్చింది. నేను గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా పర్సనల్ జీవితంలో ఎన్నో విషయాల పట్ల రాజీ పడాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద రియా ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో రియా కు విదేశీ ప్రయాణంకు అనుమతి ఇవ్వలేదు. పాస్ పోర్ట్‌ను స్వాదీనం చేసుకున్న కోర్ట్ ఎట్టకేలకు రియాకు ఆమె పాస్ పోర్ట్‌ను తిరిగి ఇవ్వడం జరిగింది. దాంతో రెక్కలు వచ్చిన పక్షి మాదిరిగా మళ్లీ రియా చక్రవర్తి విదేశాల్లో ప్రయాణించే అవకాశం దక్కిందని ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసులో..
తన పాస్‌పోర్ట్ రావడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెడతాను అంటూ రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తన పాస్‌పోర్ట్ ను చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ చనిపోయి దాదాపుగా అయిదు ఏళ్లు పూర్తి అవుతుంది. అయినా కూడా ఆయన అభిమానులు ఇప్పటికీ ఆవేశంతోనూ ఊగిపోతున్నారు. రియా చక్రవర్తిని ఇప్పటికీ దోషిగానే చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఈమె పాస్‌పోర్ట్ ఫోటోను షేర్ చేసిన వెంటనే తమదైన శైలిలో విరుచుకు పడ్డారు. అన్యాయంగా ఒక మంచి వ్యక్తి చనిపోవడంకు మీరు కారణం అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు ఈ విషయంలో మీరు ఇప్పటికి అయినా పశ్చాతాపం పడుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ కొందరు ఆమెను టార్గెట్ చేసి కామెంట్ చేశారు.
బిగ్‌బాస్‌లో ఎంట్రీకి ప్రయత్నాలు
మేరే డాడ్ కి మారుతి సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన రియా చక్రవర్తి వరుస సినిమాలు చేయాలని ఆశ పడింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఇష్యూ కారణంగా రియా చక్రవర్తికి సినిమా ఆఫర్లు రాలేదు. ఆ మధ్య సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నాను, అందంగా, గ్లామర్‌గా కనిపించేందుకు రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చింది. కానీ ఏ ఒక్క ఆఫర్ ఈమె తలుపు తట్టలేదు. ఇదే సమయంలో ఈమె బిగ్‌బాస్ తో రీ ఎంట్రీ ఇస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అని భావించిందట. బిగ్‌బాస్ లోకి వెళ్లేందుకు ఆమెకు కోర్ట్ నుంచి ఇబ్బందులు ఉండటంతో అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మొత్తానికి రియా చక్రవర్తి మెల్ల మెల్లగా ఆ ఇబ్బందుల నుంచి బయట పడుతుంది. కనుక సినిమాల్లో బిజీ అవుతుందేమో చూడాలి.