తల్లి కాబోతున్న యంగ్ బ్యూటీ.. క్యూట్ బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యూటీ తల్లి కాబోతున్నాను అంటూ భర్తతో కలిసి తాజాగా క్యూట్ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.;
సినీ సెలబ్రిటీలు కొంతమంది ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరి కొంతమంది తమ జీవితంలోకి వారసులను ఆహ్వానిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, అల్లు శిరీష్- నయనికా రెడ్డి, నిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్య రెడ్డి జంటలు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాయి.
మరొకవైపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ పండంటి పాపాయికి జన్మనిచ్చి శుభవార్త చెప్పగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరోసారి తల్లి కాబోతున్నాను అంటూ అభిమానులతో శుభవార్త పంచుకుంది. అంతేకాదు అటు అమలాపాల్ కూడా తన సోదరుడు తండ్రి కాబోతున్నాడు అంటూ తన మరదలి బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇలా సెలబ్రిటీలంతా ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతుంటే.. ఇప్పుడు మరో శుభవార్త అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యూటీ తల్లి కాబోతున్నాను అంటూ భర్తతో కలిసి తాజాగా క్యూట్ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి రెబా మోనిక జాన్.. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన రెబా మోనిక 2016లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' అనే చిత్రంతో మలయాళం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2018లో జరుగండి అనే తమిళ చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలా తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కన్నడ సినీ రంగ ప్రవేశం కూడా చేసింది.
ఇక 2023లో వచ్చిన సామజ వరగమన అనే సినిమాతో తొలిసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం మ్యాడ్ స్క్వేర్ సినిమాతోనే.. ఈ సినిమాలో స్వాతి రెడ్డి అనే ప్రత్యేక పాటలో నర్తించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయిపోయింది రెబా మోనిక జాన్. సినిమాలతోనే కాకుండా టెలివిజన్ షోలతో మ్యూజికల్ వీడియోలతో సందడి చేసిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే 2022లో జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది.
ఇక నాలుగేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా.. క్యూట్ బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహించిన ఈమె..ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.." మేము ఇద్దరి నుండి ముగ్గురుగా ఎదుగుతున్నాము. ఈ అద్భుతమైన బహుమతిని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు .ఈ ప్రత్యేకమైన ప్రయాణాన్ని మేము ప్రారంభిస్తున్న కారణంగా మీ అందరి ప్రేమను, ఆశీస్సులను కోరుకుంటున్నాము" అంటూ రెబా మోనిక జాన్ తెలిపింది. ఇకపోతే తాను గర్భం దాల్చాను అన్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు , సినీ సెలబ్రిటీలు ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి