మాస్ రాజా తో క్లాసిక్ డైరెక్టరా?
జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ రాజా పుల్ స్పీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం `మాస్ జాతర`లో నటిస్తున్నాడు.;
జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ రాజా పుల్ స్పీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం `మాస్ జాతర`లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్ లతో రవితేజ బిజీగా ఉన్నాడు. వాటితో పని లేకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీలు వస్తే వాటిని లాక్ చేసి పెడుతున్నారు. రైటర్లు..డైరెక్టర్లు ఇలా రెండు రకా లుగా వస్తోన్న స్టోరీల్లో నచ్చిన వాటిని లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ శంకర్ తో పాటు ఓ తమిళ దర్శకుడు కథకు కూడా ఒకే చెప్పినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనా:
ఇద్దరు చెప్పిన స్టోరీలు నచ్చడంతో చేద్దామనే మాట కూడా ఇచ్చినట్లు వినిపిస్తోంది. తాజాగా రవితేజ కాంపౌండ్ లో క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా చేరడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే రవితేజకు ..శివ ఓ థ్రిల్లర్ స్టోరీ వినిపించాడుట. నచ్చడంతో ఆయన కూడా ఒకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలి సింది. ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొస్తున్నట్లు సమాచారం. దీంతో రవితేజ-శివ నిర్వాణ కాంబో ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ గా శివ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
ముందుగా ఎవరితో:
ఆయన క్లాసిక్ స్టోరీల డైరెక్టర్ . `నిన్నుకోరి`, `మజలి`, `ఖుషీ` లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నానితో చేసిన `టక్ జగదీష్` తో కొత్తగా ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. దీంతో మళ్లీ తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీ ల వైపే వెళ్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ నాగ చైతన్య తో మరో సినిమా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నాగ చైతన్య తదుపరి చిత్రం కూడా శివతోనే ఉంటుందని వార్తలొచ్చాయి. ఇంతలోనే రవితేజ పేరు తెరపైకి రావడం ఆసక్తికరం.
రాజా ఛాన్స్ ఇచ్చేది ఎవరికి:
రవితేజ మాస్ ఇమేజ్ కు శివ పూర్తి కాంట్రాస్ట్. థ్రిల్లర్ జోనర్ అంటే శివకు కూడా ఇదే తొలిసారి. ఈజానర్లో ఆయన ఇంత వరకూ సినిమాలు చేయలేదు. ఇదే నిజమైతే ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లే. అయితే ఈ కాంబో చేతులు కలపడానికి మరింత సమయం పడుతుందా? లేదా? అన్నది రవితేజ చేతుల్లో పని. శివ కంటే ముందుగానే కల్యాణ్ కృష్ణ, తమిళ్ డైరెక్టర్లు క్యూ లో ఉన్నారు. వాళ్లను హోల్డ్ లో పెట్టి శివతో రవితేజ ముందుకెళ్తేనే 2026 కల్లా పూర్తవుతుంది. లేదంటే? ఆ సినిమా గురించి ఇప్పట్లో ఆలోచించాల్సిన పనిలేదు.