ఇద్దరి మధ్య జానపదంలో రొమాన్స్!
ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.;
మాస్ రాజా రవితేజ, ఆషీకా రంగనాధ్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వినోదం, భావోద్వేగం అంశాల నేపథ్యంలో కిషోర్ మార్క్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. రవితేజ మాస్ ఇమేజ్ని పక్కన బెట్టి చేస్తోన్న చిత్రమిది. రవితేజ పాత్ర రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండబోతుంది. మాస్ రాజా క్లాసిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. కిషోర్ తెరకెక్కించిన గత చిత్రాలు కొన్ని మంచి విజయం సాధించగా, కొన్ని యావరేజ్ గా ఆడాయి. డిజాస్టర్ గా మాత్రం ఇంత వరకూ ఏ సినిమా చేయలేదు.
ఈ నేపథ్యంలో కిషోర్ సినిమా అంటే మినిమం ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిలో భాగంగా రవితేజ-ఆషీకా రంగనాధ్ లపై ఓ పాట చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాట చిత్రీ కరణ ఓ భారీ సెట్ లో జరుగుతోంది. ఇది జానపద నేపథ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్యూయోట్ సాంగ్ అని తెలిసింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్లో రవితేజ సాంగ్స్ చేసి చాలా కాలమవుతోంది. గత కొంత కాలంగా ఆయన సినిమాలో పాటలు మాస్ కోణంలో హైలైట్ అవుతున్నాయి.
నాయికల తో పాటలు అంతే రొటీన్ గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల అండ్ కో హీరో-హీరోయిన్ల మద్య పాట కొత్తగా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాటల్ని కూడా అందంగా హైలైట్ చేయడం కిషోర్ తిరుమల ప్రత్యేకత. స్టోరీ ఎక్కడా డీవియేట్ కాకుండా కథలో భాగంగా పాటల్ని నడిపించడంలో స్పెషలిస్ట్. ఈ నేపథ్యంలో ఈ జానపద గీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గామారాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అతడు పని చేసిన సినిమాలు మంచి విజయం సాధించడంతో? లైనప్ లో ఉన్న సినిమాలపై మంచి బజ్ నెలకొంది. కిషోర్ తిరుమల సైతం పాటలపై మంచి అభిరుచి ఉన్న దర్శకుడు. సినిమాను మ్యూజికల్ గా ముందే హిట్ చేయగలడు. దీంతో తాజా సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఈ చిత్రం కొత్త ఏడాదిలో రిలీజ్ కానుంది. విడుదలకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అందించలేదు.