రవితేజ 'సార్'.. కచ్చితంగా అలా ఉండేది కాదు..!

కొన్ని కథలు రాసుకున్నప్పుడు ఒక హీరోకి అనుకుని తీరా అతనితో కుదరక వేరే హీరోతో చేసి సక్సెస్ కొడతారు.;

Update: 2025-10-21 07:00 GMT

కొన్ని కథలు రాసుకున్నప్పుడు ఒక హీరోకి అనుకుని తీరా అతనితో కుదరక వేరే హీరోతో చేసి సక్సెస్ కొడతారు. అలానే రెండేళ్ల క్రితం వచ్చిన సార్ సినిమా కూడా డైరెక్టర్ వెంకీ అట్లూరి అసలు ఆ కథని ఒక హీరోకి రాసుకుంటే అది కాస్త ఆ హీరో వేరే కమిట్మెంట్ ల వల్ల మిస్ అవ్వడంతో ధనుష్ దగ్గరకి వెళ్లింది. ఐతే సార్ సినిమా వెంకీ అట్లూరి ముందు చెప్పింది ఎవరికంటే మన మాస్ మహరాజ్ రవితేజకి అని తెలుస్తుంది. లేటేస్ట్ గా మాస్ జాతర ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా వెంకీ అట్లూరి యాంకర్ గా రవితేజ స్పెషల్ చిట్ చాట్ చేశాడు.

రవితేజ అలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేసిన ప్రతిసారి..

అందులోనే సార్ కథ ముందు రవితేజ గారితో చేయాలని అనుకున్నా కానీ ఆయన డేట్స్ కుదరక ధనుష్ గారితో చేశా అన్నాడు వెంకీ. ఐతే రవితేజ తో సార్ వెంకీ ఈ అటెంప్ట్ ఎలా చేయాలని అనుకున్నాడన్న డౌట్ మొదలైంది. ఎందుకంటే రవితేజ అలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేసిన ప్రతిసారి కూడా అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. రవితేజ ఏరి కోరి చేసిన సినిమాలు.. స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేసిన ప్రయత్నాలు కూడా మిస్ ఫైర్ అయ్యాయి.

సార్ కథ.. కథనం కూడా గ్రిప్పింగ్ గా ఉంటాయి. ధనుష్ లాంటి నటుడు ఆ సినిమా చేశాడు కాబట్టి అతని మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు కాబట్టి వర్క్ అవుట్ అయ్యింది. ఐతే రవితేజ సార్ సినిమా చేసుంటే మాత్రం రవితేజ మార్క్ కామెడీ లేదు, మాస్ యాక్షన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదని ఆడియన్స్ భావిస్తారు. రవితేజకి కొత్త కథలు.. ప్రయోగాలు చేయాలని ఉంటుంది. కానీ ఫ్యాన్స్ ఆయన్ను అలా ఎంటర్టైనింగ్ సినిమాలే చేస్తే చాలని అంటుంటారు.

రవితేజ మాస్ జాతర సినిమాతో కంబ్యాక్..

ఐతే రవితేజ చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలం అవ్వడం వల్ల ఇలా జరిగింది కానీ సార్ సినిమా రవితేజ చేసినా ఆయన ఎనర్జీ తోడై ఉండేదని కొందరు ఆడియన్స్ అంటున్నారు. మాస్ రాజా రవితేజ మాస్ జాతర సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ధమాకా తర్వాత సరైన సక్సెస్ లేని రవితేజ మాస్ జాతర మీద చాలా నమ్మకంగా ఉన్నారు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ జాతర సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

Tags:    

Similar News