ఇరుముడి సెన్సార్.. అన్ని కుదిరినట్లేనా..

రవితేజ ఇరుముడి రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో సినిమా మీద మంచి బజ్ వచ్చింది.

Update: 2026-08-18 05:28 GMT

రవితేజ ఇరుముడి రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో సినిమా మీద మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. టైటిల్స్‌తో కలిపి రన్ టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా లాక్ చేశారు. రవితేజ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తుండగా, ఈసారి మాత్రం ఫ్యామిలీ థ్రిల్లర్ వైపు వెళ్లడం మొదటి నుంచే సినిమాకు కాస్త కొత్త లుక్ ఇచ్చింది.

ఇరుముడిలో రవితేజ మిడిల్ క్లాస్ తండ్రిగా కనిపించనున్నాడు. తాగుడు అలవాటు ఉన్నా కూతురి విషయంలో చాలా బాధ్యతగా ఉండే వ్యక్తి. అమ్మాయిల భద్రత, పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులతో ఓపెన్‌గా చెప్పుకునే పరిస్థితి ఎందుకు ఉండాలి అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ ట్రాక్‌లోనే అయ్యప్ప దీక్షను దర్శకుడు శివ నిర్వాణ కలిపాడు.

అయితే అయ్యప్ప మాలనే మొత్తం కథగా తీసుకోలేదని సెన్సార్ తర్వాత వస్తున్న రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒకవైపు తండ్రిగా కూతురి కోసం పోరాడే వ్యక్తి, మరోవైపు దీక్షలో ఉండే భక్తుడు.. ఈ రెండు కోణాల్లో రవితేజ పాత్ర సాగుతుందట. తాగుడు అలవాటు నుంచి బయటపడలేని వ్యక్తిగా మొదలయ్యే క్యారెక్టర్‌లో కూడా మార్పులు ఉంటాయని సమాచారం. ఈ పాత్రలో రవితేజ నటన గురించి సెన్సార్ వర్గాల నుంచి మంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని టాక్. ఇప్పటికే బయటకు వచ్చిన ‘మల్లెపూల పల్లకి’ పాట బాగా కుదిరిందని చెబుతున్నారు. బయట పాటగా వచ్చినప్పుడు కొంత మిక్స్‌డ్ రెస్పాన్స్ కనిపించినా, కథలో వచ్చే సమయంలో దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుందని టీమ్ నమ్మకంగా ఉంది.

శివ నిర్వాణ ఈసారి ఎక్కువగా రియల్ లొకేషన్లలోనే సినిమా తీసినట్లు తెలుస్తోంది. కథ గ్రామీణ ప్రాంతాల్లో నడవడంతో సెట్స్ కంటే సహజమైన వాతావరణానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ కూడా అదే మూడ్‌కు తగ్గట్టుగా ఉందని సమాచారం. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రవితేజ నుంచి రెగ్యులర్ మాస్ సినిమా ఆశించే వాళ్లకు ‘ఇరుముడి’ పూర్తిగా అదే ప్యాకేజ్ కాకపోవచ్చు. అలాగని ప్రయోగం పేరుతో కమర్షియల్ అంశాలను పక్కన పెట్టిన సినిమా కూడా కాదు. ఫ్యామిలీ ఎమోషన్, థ్రిల్లర్, అయ్యప్ప దీక్ష, యాక్షన్ అన్నీ ఒకే కథలో కలిపారు. ఇక ఈ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కు ఏ స్థాయిలో కనెక్ట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News