మాస్ రాజా ర‌వితేజ మేధోమ‌థ‌నం!

లేదంటే స‌న్నివేశం మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. దీంతో రవితేజ తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Update: 2026-09-03 19:30 GMT

మాస్ మహారాజా రవితేజ వ‌రుస‌గా ఐదారు ప్లాప్ త‌ర్వాత‌ తాజాగా రిలీజ్ అయిన `ఇరుముడి` చిత్రంతో సాలిడ్ సక్సెస్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. చాలాకాలం త‌ర్వాత ర‌వితేజ న‌ట‌న‌కు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి. ద‌ర్శ‌కుడి శివ నిర్వాణ టేకింగ్.. వైవిథ్యం సినిమాను ఆ రేంజ్ కి తీసుకెళ్లాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం.అయితే ర‌వితేజ ఇదే స‌క్సెస్ ను త‌దుప‌రి కొన‌సాగించాలి. లేదంటే స‌న్నివేశం మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. దీంతో రవితేజ తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

`ఇరుముడి` అందించిన విజయ పరంపరను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో కొత్త కథల ఎంపికపై మ‌రిన్ని కసరత్తులు చేస్తున్నారు. గ‌తంలో ఓ సినిమా సెట్ లో ఉండ‌గానే రాజా నుంచి మ‌రో సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చేది. కానీ ఇప్పుడా స్పీడ్ త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో ర‌వితేజ లో కొత్త రియ‌లైజేష‌న్ క‌నిపిస్తుంది. వర్తమాన పరిశ్రమలో కథల ఎంపిక .. ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మునుపటిలా సులభమైన విషయం కాదు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, డిజిటల్ విప్లవం, పాన్-ఇండియా స్థాయి పోటీల నడుమ ప్రతీ నిర్ణయం చాలా కీలకంగా మారింది.

రవితేజ మార్కు ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ తగ్గకుండానే నేటి ట్రెండ్‌కు తగినట్టుగా కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే కథలతో పాటు దర్శకుడి ప్రతిభ, విజన్, ట్రాక్ రికార్డ్‌ను కూడా లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రవితేజ స్పీడ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. అయితే ఇప్పుడు సినిమాల సంఖ్య పెంచుకుంటూ వెళ్ల‌డం కంటే క్వాలిటీ కంటెంట్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. `ఇరుముడి` విజయం ఆయన మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచడమే కాకుండా ఆడియన్స్‌లో రాజా సినిమాలపై అంచనాలను కూడా పెంచేసింది.

ఈ క్రమంలో ఒకే రకమైన రొటీన్ మాస్ ఫార్ములాకు పరిమితం కాకుండా విభిన్నమైన జోనర్లను ప్రయత్నించేందుకు కథలపై గంటల తరబడి మేధోమథనం సాగిస్తున్నారు. ఇక కొత్త దర్శకుల విషయంలో కూడా మాస్ రాజా చాలా విష యాలను పరిగణనలోకి తీసుకుంటున్నారుట‌. కథ చెప్పే విధానం , విజువల్ ప్రెజెంటేషన్, బడ్జెట్ హ్యాండ్లింగ్‌లో స్పష్టత ఉన్న మేకర్స్‌కే మొగ్గు చూపుతు న్నారుట‌. రవితేజ నుంచి వచ్చే ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైనర్‌గా ఉండాలనే ఒత్తిడి కూడా ప్రొడక్షన్ వర్గాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజా కథల స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్‌లలో స్వయంగా మార్పులు చేర్పులు సూచిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

ఏదేమైనా? విజయవంతమైన చిత్రం తర్వాత మరింత బాధ్యతాయత‌గా కథలను ఎంచుకోవడం స్టార్ హీరోకు అత్యంత అవసరం. ప్రస్తుతం ర‌వితేజ చేతిలో కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఏది ఫైన‌ల్ చేయాల‌న్న‌ది దానిపై ప‌ని చేస్తున్నారు. మ‌రి ఈ మేధోమథనం నుంచి ఎలాంటి పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ బయటకు వస్తుందో? ఆ కొత్త ప్రకటనతో అభిమానులకు ఎలాంటి? స్వీట్ సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News