• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక మంచి మనసు.....

రష్మిక మంచి మనసు.. అసిస్టెంట్ పెళ్లికి వెళ్లి..!

| తాజాగా రష్మికకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక ఓ పెళ్లికి వెళ్లింది. తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్ పెళ్లికి వెళ్లింది.

By - Tupaki Desk
Update: 2023-09-04 12:28 GMT

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో రష్మిక ఒకరు. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతోంది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా, బాలీవుడ్ లోనూ ఆమె వరస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.


ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా రష్మికకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక ఓ పెళ్లికి వెళ్లింది. తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్ పెళ్లికి వెళ్లింది. నిజానికి సెలబ్రెటీలు తమ పెళ్లికి వస్తే బాగుండు అని అందరూ కోరుకుంటారు. కానీ, ఆ సెలబ్రెటీలు తొందరగా వెళ్లరు. కానీ, రష్మిక మాత్రం తన మేకప్ అసిస్టెంట్ పెళ్లికి వెళ్లింది.

చక్కగా, పద్దతిగా చీర కట్టుకొని మరీ ఆమె పెళ్లికి వెళ్లడం విశేషం. పసుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది. పెళ్లికి వెళ్లడమే కాదు, వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ఇక, రష్మిక తమ పెళ్లికి రావడంతో ఆనందం తట్టుకోలేక ఆ నూతన వధూవరులు ఆమె కాళ్ల మీద పడి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు.

వారు చేసిన పనికి ముందు రష్మిక షాకైనా, ఆ తర్వాత వెంటనే వారికి తన ఆశీర్వాదం అందించింది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. రష్మిక మంచి మనుసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎంత మంచి మనసు అండి మన రష్మిక ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక కట్టుకున్న చీర దాదాపు రూ.35వేలు అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప2లో నటిస్తోంది. దీంతో పాటు, నితిన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ మూవీ నుంచి రష్మిక తప్పుకుంది. ఇక, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ మూవీలో తన పాత్ర కోసం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Rashmikamandanna 
  • Actressrashmika 
  • Assistant 
  • Wedding 
  • Socialmedia 
  • Viralvideo 
  • Pushpa2 
  • Nithin 
  • Animalmovie 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS