చీరలో కూడా రష్మిక గ్లామర్ ఎటాక్

దీంతో బ్యూటీలు.. చీర కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తుంటారు.;

Update: 2024-02-03 03:57 GMT

హీరోయిన్లు స్క్రీన్ పై ఎంత మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినా.. చీర కట్టులో తళుక్కుమంటే ఆ కిక్కే వేరు. ఏదైనా వేడుకల్లో పది మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలన్నా కూడా మోడ్రన్ డ్రెస్సుల కంటే చీర కట్టుకు ఉండే క్రేజే వేరు. దీంతో బ్యూటీలు.. చీర కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తుంటారు.


అయితే సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్‌ రష్మిక మందన్నకు వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ హిట్ సినిమాలు, పెద్ద హీరోలతో నటించి స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ.. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసారి సౌత్, నార్త్ ఇండస్ట్రీలను కుదిపేసింది.


తాజాగా లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తన సోకులు చూపిస్తూ లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చీర ఎప్పటికీ రాంగ్ సెలక్షన్ కాదంటూ క్యాప్షన్ ఇచ్చింది. స్టన్నింగ్ చూపులతో కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెట్టేస్తోంది. ప్ర‌స్తుతం చీర క‌ట్టులో మాయ చేస్తున్న ర‌ష్మిక ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ‌గా మారాయి. ఈ పిక్స్ లో రష్మిక అందం దేంతో పోల్చిన తక్కువే అన్నట్లుగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

లవ్లీ, బ్యూటీఫుల్, మ్యాంగో బేబీ అంటూ కుర్రాళ్లు.. రష్మిక అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. సినిమాల్లో నటన, గ్లామర్‌ తో భారీగా అభిమానుల్ని సొంతం చేసుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటోంది. ఈ అమ్మడికి 41.5 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు.

రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా పాపులర్‌ శ్రీవల్లి పాత్రలో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర దేశాలు దాటి పాపులర్‌ అయ్యింది. పుష్ప-1 పెద్ద హిట్‌ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. దీంతోపాటు రెయిన్‌ బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది నేషనల్ క్రష్.


Tags:    

Similar News