‘మైసా’ డేట్ లాక్.. రష్మికకు టైమ్ తక్కువే!

రష్మిక గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి రావాల్సి ఉంది. డేట్ ఫిక్స్ కావడంతో మిగిలిన పనికి ఇప్పుడు మూడు నెలల సమయం ఉంది.

Update: 2026-09-01 10:03 GMT

రష్మిక మందన్న ‘మైసా’ నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్‌తో పాటు వచ్చిన పోస్టర్‌లో ఆమె చేతిలో ఈటె పట్టుకుని, రక్తం ఉన్న లుక్‌లో కనిపించింది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్ కూడా ఇదే రఫ్ టోన్‌లో ఉన్నాయి. సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తికాలేదు. రష్మిక గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి రావాల్సి ఉంది. డేట్ ఫిక్స్ కావడంతో మిగిలిన పనికి ఇప్పుడు మూడు నెలల సమయం ఉంది.



 


‘మైసా’ షూటింగ్‌లోనే రష్మికకు హిప్ దగ్గర గాయమైంది. ఒక డాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా ఆమె ఆమె ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొంతకాలం పని ఆపి రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సినిమా కోసం ఇంకా కొంత భాగం మిగిలి ఉండటంతో, ఆమె మళ్ళీ వచ్చాక షెడ్యూల్‌ను ప్లాన్ చేయనున్నారు.

ఈ సినిమాలో రష్మిక గోండ్ తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. పాత్ర కోసం బ్యాంకాక్‌లో యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంది. కేరళలో జరిగిన షెడ్యూల్‌లో స్టంట్స్ కూడా చేసింది. నీళ్లలో జరిగే ఒక టఫ్ సీక్వెన్స్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటివరకు రష్మిక చేసిన కమర్షియల్ సినిమాల కంటే ఇందులో ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే గాయం తర్వాత మిగిలిన యాక్షన్ సీన్స్ కోసం టైమ్ తీసుకుంటున్నారు.

రష్మిక విజయ్ దేవరకొండతో నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న వస్తోంది. దానికి 42 రోజుల తర్వాత ‘మైసా’ రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల ప్రమోషన్స్ ఒకే సమయంలో దగ్గరపడే అవకాశం ఉంది. ‘మైసా’లో మాత్రం కథ మొత్తం తన చుట్టూ తిరిగేలా ఇప్పటివరకు చూపించారు. నవంబర్ వరకు రష్మికకు షూటింగ్‌తో పాటు రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా వరుసగా ఉండొచ్చు.

డైరెక్టర్ రవీంద్ర పుల్లెకు ‘మైసా’ మొదటి సినిమా. మొదటి సినిమాతోనే ఐదు భాషల్లో విడుదలకు వెళ్లడం అంటే అతనిపై చాలా ప్రెజర్ ఉంటుంది. ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో ఉన్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన మెటీరియల్‌లో కథ కంటే రష్మిక పాత్ర, ఆమె లుక్, యాక్షన్ పార్ట్ లను ఎక్కువగా హైలెట్ చేశారు. ట్రైలర్ వచ్చిన తర్వాతే కథ ఎలా నడుస్తుందో తెలుస్తుంది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27నే సినిమాను విడుదల చేయనున్నారు. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా, ఆడియో హక్కులు టీ సిరీస్ దగ్గర ఉన్నాయి. థియేటర్ రిలీజ్‌కు ముందే సినిమా మంచి డిమాండ్ ను అందుకుంటోంది. ఇప్పుడు మేకర్స్ చేతిలో ఎక్కువ టైమ్ లేదు. రష్మిక షూటింగ్‌లోకి వచ్చిన తర్వాత మిగిలిన భాగం పూర్తయితే, అక్టోబర్ నుంచి రెగ్యులర్ ప్రమోషన్స్‌ స్టార్ట్ కావచ్చు.

Tags:    

Similar News