హీట్ పెంచిన రష్మిక.. అదిరిపోయే లుక్స్ లో..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న గత కొంతకాలంగా వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-04 11:36 GMT

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న గత కొంతకాలంగా వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. అలా స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో ఈమె ఫోటోలను తీర్చిదిద్ది.. ఆ ఫోటోలు షేర్ చేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది రష్మిక. ముఖ్యంగా అధునాతన టెక్నాలజీ అయిన ఏఐ ను తప్పుదోవ పట్టిస్తూ రష్మిక బికినీ వేసుకున్నట్టు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆమెను మరింత ఇబ్బందులకు గురి చేశారు.



 


ఇకపోతే దీనిపై ఇటీవల స్పందించిన రష్మిక మందన్న కూడా ఏఐ వాడకంపై మండిపడింది. మనుషుల్లాగా ప్రవర్తించండి అంటూ ఆకతాయిలను హెచ్చరించింది. ఇకపోతే ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూ ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. హాలీవుడ్ రిపోర్టర్ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చాలా హుందాగా ట్రెండీ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది రష్మిక. వైట్ షర్టు, బ్లాక్ కోట్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో బ్లాక్ కలర్ షాట్ ధరించింది. గం బూట్స్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది రష్మిక. తర్వాత మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. మొత్తానికైతే ఈ మ్యాగజైన్ కోసం రష్మిక ఇచ్చిన లుక్స్ కి అభిమానులు కూడా హీటెక్కిపోతున్నారు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



 


రష్మిక పర్సనల్ విషయానికి వస్తే.. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండతో గీతాగోవిందం సినిమా సమయంలోనే పరిచయం ఏర్పడగా.. అప్పటి నుంచే ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా కూడా వచ్చింది. ఇక ఇప్పటినుంచి ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఎన్నోసార్లు కెమెరా కంటపడ్డారు. అంతేకాదు పలు ఈవెంట్లకి కలిసి హాజరవుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. పైగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు ఇటీవల రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.



 


ఇకపోతే తమ నిశ్చితార్థం పై రష్మిక ఓపెన్ అయ్యింది కానీ విజయ్ దేవరకొండ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. దీనిపై కూడా రష్మిక స్పందించింది. దీనిపై రష్మిక మాట్లాడుతూ.." నేను వివాహాన్ని తిరస్కరించడానికి లేదా ధ్రువీకరించడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే దాని గురించి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతాను. ప్రతిదానికి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ విషయాలపై స్పందిస్తాను. అప్పటివరకు నేనేం చెప్పను " అంటూ పెళ్లి వార్తలపై తనదైన శైలిలో కామెంట్ చేసింది రష్మిక. దీంతో వీరిద్దరి పెళ్లి వార్తలపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు .మరొకవైపు వీరిద్దరి పెళ్లి పనులు అప్పుడే మొదలయ్యాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News