విజయ్ దేవరకొండ లుక్ లీక్ చేసిన రష్మిక.. 'రణబాలి' సెట్స్ నుంచి క్రేజీ పోస్ట్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక క్రేజీ పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ సెట్స్‌లో విజయ్ దేవరకొండ ముఖం కొద్దిగా కనిపించేలా ఒక ఫోటోను లీక్ చేస్తూ రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రచ్చ:
సినిమా సెట్స్ నుంచి రష్మిక షేర్ చేసిన పిక్‌లో విజయ్ దేవరకొండ ఒక సరికొత్త లుక్ కోసం రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ లుక్ పూర్తిగా రివీల్ కాకుండా కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ విజయ్ ఫేస్ కొద్దిగా మాత్రమే కనిపించేలా రష్మిక ఫోటో పెట్టింది. "దీన్ని మీకు ఇప్పుడే బయటపెట్టచ్చో లేదో నాకు తెలియదు. ఇక గతంలో చాలాసార్లు జరిగినట్లుగా, ఈ పోస్ట్‌ను డిలీట్ చేయమని నన్ను చిత్ర యూనిట్ అడగరని ఆశిస్తున్నాను. కానీ ఈ కుర్రాళ్లు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. నా ఉత్సాహాన్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాను. దీన్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను" అంటూ రష్మిక రాసుకొచ్చింది.
హాలీవుడ్ విలన్‌తో విజయ్ ఫైట్:
ఈ చిత్రంలో మరో అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ మూవీ 'ది మమ్మి' విలన్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. 'సర్ థియోడర్ హెక్టర్' అనే పవర్‌ఫుల్ బ్రిటిష్ ఆఫీసర్ పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకు, ఈ హాలీవుడ్ విలన్‌కు మధ్య వచ్చే మైండ్‌బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
టాక్సీవాలా కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్:
గతంలో విజయ్ దేవరకొండకు 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఇక గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్, ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీతో గట్టి కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఫుల్ నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
రష్మిక షేర్ చేసిన ఈ లీక్డ్ పిక్‌తో అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ హిట్‌గా నిలిచిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు, ఈసారి పీరియాడిక్ లుక్‌లో చూస్తుండటంతో క్రేజ్ మరింత పెరిగింది. మరి 2026 సెప్టెంబర్‌లో రాబోతున్న ఈ 'రణబాలి' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.