రష్మిక మందన్నా.. కల్ట్ రోల్‌లోకి జంప్ చేస్తుందా?
ఈ సీక్వెల్ కాక్‌టెయిల్ 2 పేరుతో రూపొందుతోంది. ఇందులో శాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించనున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది.;
స్టార్ హీరోయిన్‌గా దక్షిణాది నుంచి బాలీవుడ్ దాకా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రష్మిక మందన్నా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలుస్తోంది. 2012లో విడుదలైన కాక్‌టెయిల్ అనే హిందీ సినిమా, అప్పటి యువతలో కల్ట్ ఫాలోయింగ్ ను కలిగిన ఒక ప్రేమ కథ. దీన్ని దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కించగా, కథను ఇమ్తియాజ్ అలీ రాశారు. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్ కాక్‌టెయిల్ 2 పేరుతో రూపొందుతోంది. ఇందులో శాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించనున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ క్యూట్ రొమాంటిక్ డ్రామాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నాను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్‌తో, తరం మారిన ప్రేమకథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు లవ్ రంజన్ కథను అందిస్తుండగా, హోమీ అదజానియా దర్శకత్వం వహించనున్నాడు. నిర్మాతగా మ్యాడ్ డాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజన్ ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాక్‌టెయిల్ 2ను 2026 మధ్యలో విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు మేకర్స్. మ్యూజిక్, స్టోరీలైన్ విషయంలో దర్శకుడు హోమీకి మంచి నమ్మకముందని టాక్.
అయితే, అసలు 2012లో వచ్చిన కాక్‌టెయిల్‌కు ఉన్న క్రేజ్‌ను ఇప్పుడు మళ్లీ రిపీట్ చేయగలరా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం శాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అది డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇదే సమయంలో రష్మిక మందన్నా కూడా కుబేర వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ హిందీ ప్రేమ కథలో ఓ డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్ర చేయాలనే ఆసక్తి చూపుతోందని సమాచారం.
ముఖ్యంగా దీపికా పదుకునే పాత్రలా, కాక్‌టెయిల్ 2లోని పాత్ర రష్మిక కెరీర్‌కు కొత్త మలుపు కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. దీపికా పదుకునేకు అప్పట్లో కాక్‌టెయిల్‌లోని ‘వెరోనికా’ పాత్ర ఒక బ్రేక్‌థ్రూ అయింది. ఆమె నటన, స్టైల్, కేరెక్టర్ డెప్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే విధంగా ఈ సీక్వెల్‌లోని రెండో హీరోయిన్ పాత్రను రష్మిక చేస్తే, ఆమె హిందీలో తన పట్టు మరింతగా పెంచుకునే అవకాశముంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.