• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లీడ్ రోల్స్ లో విలక్షణ...

లీడ్ రోల్స్ లో విలక్షణ నటుడు!

| దర్శకుడు మారుతి సమర్పణలో రావు రమేష్ ప్రధాన పాత్రలో 'బ్యూటీ' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ జంటగా నటిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-22 23:30 GMT

విలక్షణ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దివంగత నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో, హవ భావాలు పండించడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. విలన్ గా, కామెడీ విలన్ గా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్న రావు రమేష్.. ప్రస్తుతం తెలుగు కన్నడ తమిళ భాషల్లో బిజీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి.

రావు రమేష్ టైటిల్ రోల్ లో 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' అనే సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడికి జోడీగా ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకుండానే రావు రమేష్ ప్రధాన పాత్రలో తాజాగా మరో చిత్రం పట్టాలెక్కింది. ఈరోజు సోమవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.

దర్శకుడు మారుతి సమర్పణలో రావు రమేష్ ప్రధాన పాత్రలో 'బ్యూటీ' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ జంటగా నటిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వానరా సెల్యూలాయిడ్ పతాకంపై ఎ విజయ్ పాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి.

తొలి సన్నివేశానికి డైరెక్టర్ మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. 'బ్యూటీ' అనేది లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా అని చిత్ర బృందం చెబుతోంది. దీంట్లో రావు రమేష్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

'బ్యూటీ' అనౌన్స్ మెంట్ పోస్టర్ లో హార్ట్ సేఫ్ లో మేఘాలు కనిపిస్తుండగా.. ఇద్దరు యువతీ యువకులు ప్రేమ పక్షుల్లా విహరించడాన్ని మనం గమనించవచ్చు. ఈ సినిమాకి బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మే 2వ తేదీ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఇకపోతే రావు రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే సందీప్ కిషన్, నక్కిన త్రినాథ రావు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలోనూ రావు రమేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ ఆయన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే పాత్రలే అని టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Raoramesh 
  • Leadroles 
  • MarutinagarSubramaniam 
  • Beauty 
  • VijayBulganin 
  • Babymovie 
  • Visambharamovie 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS