పాకిస్తాన్ పై ర‌ణ‌వీర్ సింగ్ కి ప్రేమా?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. సామాజిక, రాజకీయ సినీ రంగ అంశాలపై అత్యంత బహిరంగంగా మాట్లాడే కంగ‌న ఈసారి రణవీర్ సింగ్ టార్గెట్ గా వ‌స్తోన్న విమర్శలపై స్పందించారు.

Update: 2026-06-12 06:35 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. సామాజిక, రాజకీయ సినీ రంగ అంశాలపై అత్యంత బహిరంగంగా మాట్లాడే కంగ‌న ఈసారి రణవీర్ సింగ్ టార్గెట్ గా వ‌స్తోన్న విమర్శలపై స్పందించారు. ఇండస్ట్రీలో ప్రేక్షకులు రణవీర్‌ను ఎందుకు ? టార్గెట్ చేస్తున్నారనే కోణంలో కంగ‌న విశ్లేషణ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. సినిమా తారల వ్యక్తిగత ప్రవర్తన, గత వ్యాఖ్యలు , దేశీయ భావజాలం పట్ల వారికున్న వైఖరిని ప్రేక్షకులు నిశితంగా గమనిస్తుంటారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ చుట్టూ నెలకొన్న నెగిటివిటీపై ఆయన్ని కొందరు లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణాలను కంగ‌న తనదైన శైలిలో వివరించారు.

ర‌ణ‌వీర్ సింగ్ పై గతంలో వ్యక్తమైన కొన్ని ధోరణులు సగటు భారతీయ ప్రేక్షకుల భావోద్వేగాలకు భిన్నంగా ఉన్నాయన్నారు. రణవీర్ సింగ్‌లో కాస్త పాకిస్తాన్ ప్రేమ్ (పాకిస్తాన్ పట్ల సానుకూలత) దాగి ఉందంటూ సంచలన విమర్శ చేశారు కంగ‌న‌. సరిహద్దు దేశాల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యక్తపరిచే కొన్ని అభిప్రాయాలు దేశభక్తి గల ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేరని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ రకమైన వ్యక్తిగత అనుబంధాలే ర‌ణ‌వీర్ పై సామాజిక మాధ్యమాలలో వ్యతిరేకత పెరగడానికి ముఖ్య కారణమని విశ్లేషించారు.

బాలీవుడ్ పరిశ్రమలో కొంతమంది నటీనటులు పొరుగు దేశాల మార్కెట్లను ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో దేశీయ సెంటిమెంట్లను విస్మరిస్తుంటారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. స్టార్ హీరోగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు దేశీయ ప్రజల భావాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని.. అలా లేనప్పుడు ప్రేక్షకుల నుండి తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని కంగ‌న హెచ్చరించారు. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల పాత ఇంటర్వ్యూలు, పాత ప్రకటనలు ఎప్పుడైనా తెరపైకి వచ్చి వారి కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

రణవీర్ సింగ్ ఎంత ప్రతిభావంతుడు అయినా? ఆయన చుట్టూ ఉన్న ఇలాంటి వివాదాలు ర‌ణ‌వీర్ చిత్రాల బాక్స్ ఆఫీస్ ప్రదర్శనపై , బ్రాండ్ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంద‌న్నారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తోటి నటుడి జాతీయ భావజాలంపై కంగ‌న‌ చేసిన విమర్శలపై రణవీర్ సింగ్ ఎలా రియాక్ట్ అవుతారు? అన్న‌ది చూడాలి. కంగ‌న న‌టించిన తాజా చిత్రం `భార‌త్ భాగ్య విధాత` చిత్రం నేడు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News