ఆ ఇద్దరి మద్య టఫ్ ఫైట్!
బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, అమీర్, షారుఖ్ - హృతిక్ రోషన్ మధ్య ఆధిపత్య పోరు అన్నది ఎప్పటికప్పుడు కనిపిస్తుంది.;
బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, అమీర్, షారుఖ్ - హృతిక్ రోషన్ మధ్య ఆధిపత్య పోరు అన్నది ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. వరుస విజయాలు, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఈనలుగురు మధ్య పోటీ సహజంగానే హైలైట్ అవు తుంది. ఒకసారి ఒకరు టాప్ లో ఉంటే మరోసారి ఇంకో స్టార్ అగ్ర స్థానంలో కనిపిస్తుంటారు. అయితే ఆ తర్వా త తరం స్టార్ హీరోల మధ్య మాత్రం చెప్పుకోదగ్గ పోటీ ఇంత వరకూ తెరపైకి రాలేదు. కానీ రణవీర్ సింగ్-రణబీర్ కపూర్ మధ్య మాత్రం రసవత్తర పోటీ కి మెండుగా అవకాశాలున్నాయి. ఇద్దరు తమ కెరీర్‌లో అత్యున్నత దశలో ఒకరికొకరు గట్టి పోటీగా కనిపిస్తున్నారు.
రణబీర్ కపూర్ తన కెరీర్‌లో సాధించిన `యానిమల్` చిత్రం ఆయనను బాక్సాఫీస్ వద్ద అజేయమైన శక్తిగా నిలబెట్టింది. ఒకవైపు ఎమోషన్స్, మరోవైపు మాస్ యాక్షన్ పండించగలనని నిరూపించుకున్న రణబీర్ ఈ సినిమాతో 1000 కోట్ల వసూళ్లకు సమీపించాడు. వెయ్యి కోట్ల క్లబ్ ను తృటిలో మిస్ అయ్యాడు. కానీ తన నటనతో వైవిధ్యాన్ని ప్రదర్శించే రణబీర్ క్లాస్ , మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అప్పటి వరకూ నవతరం నటుల్లో టాప్ లో రణబీర్ కపూర్ మాత్రమే కనిపించాడు. కానీ రణవీర్ సింగ్ `ధురంధర్` విజయంతో అతడినే బ్రేక్ చేసాడు.
`ధురంధర్` మొదటి భాగం ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. తాజా రిలీజ్ అయిన రెండవ భాగం ఏకంగా 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంటున్నారు. అదే జరిగితే? రణవీర్ సింగ్ బాలీవుడ్ లోనే టాప్ స్టార్ గా అవతరిస్తాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం రణవీర్ కపూర్ కి పోటీగా నిలుస్తున్నాడు. రణవీర్ ఎనర్జీ , పాత్రలో ఒదిగిపోయే తీరు ఆయనకు భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. రణబీర్ కపూర్ తదుపరి `రామాయణం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లకు పైనే. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని `దంగల్` ఫేం నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు.
`దంగల్` పేరిట ఇప్పటికే 2000 కోట్ల వసూళ్లతో ఓ రికార్డు ఉంది. దాన్ని `రామాయణం` మొదటి భాగం బ్రేక్ చేస్తుం దనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే? `ధురంధర్` రికార్డులు కూడా చెరిగిపోతాయి. ఈ సమీకరణాలు ఆధారంగానే రణబీర్ కపూర్-రణవీర్ సింగ్ మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీ కూడా ఎప్పటికప్పడు మారుతూ ఉంటుంది. ఈనేపథ్యంలో భవిష్యత్ లో ఎవరు నెంబర్ వన్ గా నిలిచే అవకాశం ఉంటుందన్నది చెప్పడం కష్టమే.
కానీ రణబీర్ కపూర్ - రణవీర్ సింగ్ బాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకున్నారు అన్నది వాస్తవం. వారిద్దరి ప్రతిభ, బాక్సాఫీస్ సత్తా చూస్తుంటే రాబోయే దశాబ్ద కాలం ఇద్దరు హీరోల మధ్య పోరాటమే బాలీవుడ్‌ను శాసించనుంది. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.