ఆ జోడీ బ్రేకప్ వాదన పొంతన లేకుండా!
రణబీర్ కపూర్-దీపికా పదుకొణే ఒకప్పుడు అమర ప్రేమికులు అన్న సంగతి తెలిసిందే.;
రణబీర్ కపూర్-దీపికా పదుకొణే ఒకప్పుడు అమర ప్రేమికులు అన్న సంగతి తెలిసిందే. ఏడెనిమిదేళ్ల ప్రేమని పెళ్లి పీఠలు ఎక్కించాలనుకున్నారు. ధాంపత్య జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. కానీ ఒక్క సారిగా ఆ బంధం వీగిపో యింది. ఎవరికి వారు వేరయ్యారు. ఆ తర్వాత ప్రయాణం తెలిసిందే. రణబీర్ కపూర్ అలియాట్ తో ప్రేమ పెళ్లి. రణవీర్ సింగ్ ని దీపికా పదుకొణే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే రణబీర్ కపూర్ -దీపికా పదుకొణే విడిపోవడం విషయంలో ఎవరి వాధనలు వారివి. తాజాగా రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఈ విషయంలో కుమారుడికి మద్దతుగా నిలిచింది.
ఓ సందర్భంలో మద్దతుగా మాట్లాడిన వీడియో మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ అనుకుంటున్నట్లు రణబీర్ కు ఎక్కువ మంది గాళ్ ప్రెండ్స్ లేరు. అతడికి ఉన్నది ఒక్క గర్ల్ ప్రెండ్. ఆమె పేరు దీపిక పదుకొణే. వాళ్లిద్దరి బంధంలో ఏదో లోపముందనిపిస్తుందన్నారు. అందుకే వారిద్దరు ఆ బంధం నుంచి దూరమైనట్లు అనిపిస్తుందన్నారు. సంబంధాలు పరిపూర్ణంగా ఉంటే ఎవరూ విడిపోరని అన్నారు. అయితే నీతూ కపూర్ వాదనకు పూర్తి భిన్నంగా అప్పట్లో దీపిక వాదన హైలైట్ అయింది. రణబీర్ కపూర్ తనని చీటింగ్ చేసాడని, అతడిని రెడ్ హ్ఆయండెడ్ గా పట్టుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
ఆ తర్వాత తనని బ్రతిమలాడటంతో రెండవ అవకాశం ఇచ్చానని, అలా చేయోద్దని వెంట ఉన్న వాళ్లు చెప్పినా వినకుండా ఆ పని చేసానన్నారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానకి చాలా సమయం పట్టిందన్నారు. నమ్మకం లేని చోట ప్రేమ నిలబడటం కష్టమని దూరమైనట్లు తెలిపింది. ఈ విషయంలో రణబీర్ కపూర్ దీపిక వ్యాఖ్యలతోనే ఏకీభ వించినట్లు కనిపిస్తోంది. మామ్ మాటలతో సంబంధం లేకుండా రణబీర్ కపూర్ స్పందిచినట్లు అప్పటి మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
2011 లోనే తాను దీపికను మోసిం చేసినట్లు అంగీకరించారు. తాను తెలియని తనంతో చేసిన తప్పుగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయినా ఇదంతా గతం. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు సంతోషంగా ఉన్నారు. రణబీర్ కపూర్ కొంత కాలానికి అలియాభట్ తో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ పాప కలదు. దీపికా పదుకోణ కూడా రణవీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కూడా ఓ బిబి కలదు. ప్రస్తుతం రెండు జోడీలు బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్నాయి.