రణబలి ట్రైలర్.. ఇది సింగనమల వీరుడి దండయాత్ర

విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రణబలి ట్రైలర్ వచ్చేసింది.

Update: 2026-10-08 13:56 GMT

విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రణబలి ట్రైలర్ వచ్చేసింది. టాక్సీవాలా తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో విజయ్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు లక్కీ చార్మ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించడం, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్ నిర్మించడంతో ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో స్పెషల్ బజ్ అయితే ఉంది.




 


ఇక లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. ​ఈ సినిమా కథ రెండు వందల ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా సింగనమల ప్రాంతం నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ తో మరోసారి క్లారిటీ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దారుణాలు, కరువుతో అల్లాడిపోతున్న జనాలు, రైల్వే పనుల పేరుతో జరుగుతున్న అణచివేత.. ఈ పాయింట్స్ తో దర్శకుడు ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ ను సెట్ చేశాడు.

ప్రజలను కాపాడే బొబ్బిలి రణబలి అనే లోకల్ వారియర్ గా విజయ్ క్యారెక్టర్ ను పరిచయం చేసిన విధానం చాలా పవర్ఫుల్ గా ఉంది. ​ఈ సినిమాలో విజయ్ మేకోవర్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. తన రెగ్యులర్ అర్బన్ స్టైల్ ను పూర్తిగా పక్కనపెట్టి ఒక రఫ్ అండ్ రస్టిక్ లుక్ లోకి పరకాయ ప్రవేశం చేశాడు. రాయలసీమ యాసలో అతను చెప్పే పవర్ ఫుల్ డైలాగులు, గుర్రపు స్వారీ చేస్తూ కత్తి పట్టి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఒక పూర్తి స్థాయి మాస్ రోల్ లో బ్రిటిష్ వాళ్లతో తలబడే వీరుడిగా విజయ్ నటన కచ్చితంగా సినిమాకు హైలైట్ గా నిలుస్తుందనిపిస్తోంది. ​ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయింది. ఇంతటి ఇంటెన్స్ డ్రామా మధ్యలో వీరిద్దరి లవ్ ట్రాక్ ఒక మంచి రిలీఫ్ లా అనిపిస్తోంది.

బ్రిటిష్ అధికారిగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బయటపెట్టలా కనిపిస్తున్నాడు. అతను సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేస్తున్నారు. కరువు వచ్చినా జనాభా తగ్గుతుందని మాట్లాడే సీన్ నుంచే అతని క్రూరత్వాన్ని చూపించారు. సాంకేతికంగా చూస్తే రణబలి ఏ స్థాయిలోనూ తగ్గలేదు. అజయ్ అతుల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది.

కరువు పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమాటోగ్రఫీ, భారీ యాక్షన్ సెట్ పీసెస్ చూస్తుంటే మైత్రీ నిర్మాణ విలువల స్థాయి ఏంటో తెలుస్తుంది. చరిత్రకు కొంత లోకల్ ఫాంటసీని జోడించి దర్శకుడు రాహుల్ ఈ కథను డీల్ చేసిన విధానం ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ తీసుకురావడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అవుతోంది. కంటెంట్ మీద మేకర్స్ పెట్టుకున్న నమ్మకం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. రేపు థియేటర్లలో కూడా ఇదే రేంజ్ ఇంటెన్సిటీ కంటిన్యూ అయితే విజయ్ దేవరకొండ ఖాతాలో ఆ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడటం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




Tags:    

Similar News