విరోష్ 'రణబాలి'.. బుకింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..!

బుక్ మై షోలో గత 24 గంటల్లో 1,64,180 టికెట్లు బుక్ అయినట్లు రీసెంట్ గా మూవీ టీమ్ వెల్లడించింది.

Update: 2026-10-17 05:15 GMT

చాలా రోజుల తర్వాత స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ కొత్త అవతార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్రిటిష్ రూలింగ్ టైమ్ లో రాయలసీమ ప్రజల కష్టాలు, వారి కోసం ఓ వ్యక్తి చేసిన పోరాటం నేపథ్యంలో రణబాలి మూవీ తెరకెక్కింది. విజయ్‌ కు గతంలో ట్యాక్సీవాలాతో విజయాన్ని అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించడంతో పాటు, భారీ పీరియాడిక్ డ్రాప్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.

 

అయితే రణబాలి మూవీ బుకింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బుక్ మై షోలో గత 24 గంటల్లో 1,64,180 టికెట్లు బుక్ అయినట్లు రీసెంట్ గా మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ లో ఆ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బుకింగ్స్‌ లో కనిపిస్తున్న ఇంట్రెస్ట్ కు తగ్గట్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది ఇప్పుడే అసలు విషయం.

ఇక మూవీ విషయానికొస్తే.. 1880-1900 మధ్య కాలంలో రాయలసీమ కరువుతో అల్లాడుతుంటుంది. ప్రజలకు తిండి దొరకడమే కష్టంగా మారిన సమయంలో బ్రిటిష్ అధికారి హెక్టార్ టాక్స్ లు పేరుతో వారిని మరింత ఇబ్బంది పెడతాడు. అలాంటి పరిస్థితుల్లో రణబాలి ప్రజల తరఫున నిలబడి తిరుగుబాటు చేస్తాడు. తన ప్రాంత ప్రజల కష్టాలను దూరం చేసేందుకు పోరాటం మొదలుపెడతాడు. ఆ కథలో ఎమోషన్స్ కు, యాక్షన్ సీన్స్ కు మంచి ఛాన్స్ ఉంది. కానీ వాటిని స్క్రీన్ పై చూపించిన విధానంలోనే దర్శకుడు కొంత తడబడ్డాడు.

కథలో మ్యాటర్ ఉన్నప్పటికీ, స్లోగా సాగడం సినిమాకు మెయిన్ ప్రాబ్లమ్ గా మారింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా.. మరికొన్ని చోట్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ముఖ్యంగా కీలక సీన్స్ ప్రేక్షకులపై స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. దీంతో మంచి కథను చూస్తున్నామనే ఫీలింగ్ ఉన్నా, సినిమా ఆశించిన స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయింది. రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

రాయలసీమ యాస కూడా చాలావరకు సరిపోయింది. జయమ్మగా రష్మిక మందన్నా మెప్పించారు. విజయ్‌ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. హెక్టార్ పాత్రలో ఆర్నాల్డ్ ఒస్లూ ఆకట్టుకోగా, లాల్, ఈశ్వరీరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ పరంగా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ బాగున్నాయి. అప్పటి కాలం నాటి ఎన్విరాన్మెంట్ ను స్క్రీన్ పైకి తీసుకురావడంలో మూవీ టీమ్ మంచి ప్రయత్నం చేసింది.

అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ సరిగా కుదరలేదు. అజయ్-అతుల్ అందించిన పాటల్లో ఏందయ్య స్వామీ ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు నార్మల్ గా అనిపించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అపసరమైన స్త్రెంత్ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు బుకింగ్స్‌ లో కనిపిస్తున్న ఇంట్రెస్ట్ వసూళ్ల రూపంలో ఎంతవరకు కనిపిస్తుందో చూడాలి. విజయ్ కు ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.

Tags:    

Similar News