రానా నార్త్ అండ్ సౌత్ యూనిటీ మంత్రం!
నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకోగలరు అన్న దానిపై రానా స్పందించారు.;
విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన అత్యంత వివాదాస్పద వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. దీనికి స్వీకెల్‌గా పార్ట్ 2ని కూడా సిద్ధం చేశారు. ఇటీవలే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేసి సిరీస్‌పై అంచనాల్ని పెంచేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో జూన్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో రానా ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ప్లాల్గొంటూ ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్నారు. సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ అండ్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకోగలరు అన్న దానిపై రానా స్పందించారు. ఈ రెండు ఇండస్ట్రీలతో పాటు నటీనటులపై ప్రేక్షకులు ఎలాంటి తేడాను చూపిస్తున్నారనే దానిపై నిరంతరం జర్చ జరుగుతూనే ఉందన్నారు. `మనందరం ఒకేచోటికి వెళ్లి అక్కడి నుంచి పని చేయాలని నిర్ణయించుకుంటే మనం రాత్రికి రాత్రే ఒక పరిశ్రమగా మారతాం. అలా చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ నటీనటులం అంతా దేశ వ్యాప్తంగా వేరు వేరు భాషలు మాట్లాడుతాం, కమ్యూనికేట్ చేయడం కష్టం`అన్నారు.
పాన్ ఇండియా పరుగులో మనం మన తెలుగు మూలాలను మర్చిపోతున్నాం. ప్రతి సినిమా పాన్ ఇండియా కాదు. కాలేదు కూడా. అందులో మేము ఇప్పుడు తెలుగు మూలాలున్న కథలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. మనం ఎక్కడ ఉన్నా కానీ ఇతరులను ఆకట్టుకోగలమనే భావనని వినోద పరిశ్రమ నిరూపిస్తుంది. భిన్నమాతాలున్నా ఏకత్వంతో జీవిస్తున్నాం. మన ప్రాంతాలు, భాషలు వేరైనా అందరి ఎమోషన్, భావం ఒక్కటే.
అందుకే మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాల్సింది డిస్ట్రిబ్యూషన్, టెక్నాలజీ, మెకానిజమ్ విషయాల్లో మాత్రమే. అంటూ నార్త్ అండ్ సౌత్ యూనిటీ మంత్రం ఇండస్ట్రీలు ఏఏ విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే థోరణిలో యూనిటీని ప్రదర్శించాలో స్పష్టం చేయడం గమనార్హం. రజనీ `వెట్టయాన్` తరువాత మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని రానా చిన్న సినిమాలకు మాత్రం అండగా నిలుస్తూ న్యూ టాలెంట్‌ని సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.