సౌందర్య ముఖంపై కాలుపెట్టిన రమ్యకృష్ణ.. క్లారిటీ ఇస్తూ.. కీలక కామెంట్స్!
షోలో భాగంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. అమ్మోరు సినిమా చేసే సమయంలో సౌందర్యతో నాకు పరిచయం ఏర్పడింది.;
రమ్యకృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజ్ లిఖించుకున్న అతి కొద్దిమంది నటీమణులలో ఈమె కూడా ఒకరు. హీరోయిన్ గా మరొకవైపు విలన్ గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. 'నరసింహా' లో నీలాంబరిగా రౌద్రం చూపించిన ఈమె.. బాహుబలి లో 'శివగామి' పాత్రలో మహారాణిగా రాజసం ఉట్టిపడే పాత్రలో నటించి మెప్పించింది. అటు హీరోల సరసన హీరోయిన్ గా నటించడమే కాకుండా.. ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా, అత్తగా, అక్కగా, వదినగా కూడా నటిస్తూ తన నటన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటోంది.
అలాంటి ఈమె తాజాగా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి గెస్ట్ గా విచ్చేసింది. ఈ షోలో తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న ఈమె.. సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని అలాగే నరసింహ సినిమాలో ఆమె ముఖంపై కాలు పెట్టిన విషయాన్ని కూడా పంచుకొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తన కళ్ళముందే ఇండస్ట్రీలోకి వచ్చి.. తన కళ్ళ ముందే స్టార్ హీరోయిన్గా ఎదిగి.. చివరికి తన కళ్ళముందే మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది రమ్యకృష్ణ.
షోలో భాగంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. అమ్మోరు సినిమా చేసే సమయంలో సౌందర్యతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అతి తక్కువ సమయంలోనే ఆమెకు దగ్గర అయ్యేలా చేసింది. ఆ పరిచయం కారణంగానే నేను ఎక్కువగా సౌందర్యాతో చాలా సినిమాలు చేశాను. నా ముందు పెరిగి.. నా ముందు ఎదిగి.. పెద్దదైపోయింది. అయితే సౌందర్యను కోల్పోకుండా ఉండాల్సింది. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరు. మంచి మనసున్న స్నేహితురాలు" అంటూ కన్నీటి పర్యంతమయ్యింది రమ్యకృష్ణ.
ఆ తర్వాత జగపతిబాబు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ కాలు సౌందర్య ముఖంపై పెట్టే సీన్ ప్లే చేయగా.. ఆ వీడియో చూస్తూ సౌందర్యను తలుచుకొని మరింత ఎమోషనల్ అయింది. అయితే ఈ విషయంపై గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "నరసింహ సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశం షూట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సీన్ చేయడానికి నేను ఒప్పుకోలేదు. సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్.. పైగా ఎదురుగా స్టార్ హీరో రజినీకాంత్ ఉన్నారు. అలాంటి సమయంలో ఆ సీన్ లో నేను నటించానని చెప్పాను. కానీ డైరెక్టర్ రవికుమార్ మాత్రం ఏం పర్లేదు చేయండి అని చెప్పారు. బట్ సౌందర్య కూడా సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఎంకరేజ్ చేసింది. అయితే ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేకపోయినా అటు సౌందర్య ఇటు డైరెక్టర్ బలవంతం మేరకు నేను చేయాల్సి వచ్చింది. అయితే ఈ సీన్ తర్వాత సౌందర్య కి క్షమాపణలు కూడా చెప్పాను అంటూ తెలిపింది రమ్యకృష్ణ మొత్తానికైతే సీన్ పండడం కోసం ఎలాంటి సాహసం చేయడానికి అయినా సిద్ధమని నిరూపించారు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.