ఒకే ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలతో కలిసి నటించిన నటి
ఆ ఫ్యామిలీ మరెవరిదో కాదు, అక్కినేని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలతో రమ్యకృష్ణ కలిసి నటించారు.;
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొందరు ఎలాంటి క్యారెక్టర్లు చేయడానికైనా వెనుకడుగు వేయరు. యాక్టర్ అంటే ఎలాంటి పాత్రలైనా చేయాల్సిందే అనుకుని అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ఫలానా రకం పాత్రలే చేయాలి, ఫలానా వారి పక్కనే నటించాలని గిరి గీసుకుని ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా హీరోయిన్ల విషయాల్లో చూస్తుంటాం.
ఒకే ఫ్యామిలీకి చెందిన అందరితోనూ..
కొందరు భామలు ఒక సినిమాలో చెల్లిగా, ఓ సినిమాలో భార్యగా, ఇంకో సినిమాలో అత్తగా మరో సినిమాలో అమ్మగా నటించి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే రమ్యకృష్ణ టాలీవుడ్ లోని ఓ ఫ్యామిలీకి చెందిన హీరోలందరితో కలిసి నటించారు.
ఏఎన్నార్, నాగార్జునతో పలు సూపర్‌హిట్ సినిమాలు
ఆ ఫ్యామిలీ మరెవరిదో కాదు, అక్కినేని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలతో రమ్యకృష్ణ కలిసి నటించారు. తాత, తండ్రి, కొడుకులు ఇలా ప్రతీ ఒక్కరితో రమ్యకృష్ణ స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి అక్కినేని అఖిల్ వరకు మూడు తరాల హీరోలతో కలసి ఆమె నటించారు. ఏఎన్నార్ తో కలిసి సూత్రధారుడు, దాగుడు మూతల దాంపత్యంలాంటి సినిమాల్లో నటించారు.
తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన పలు సినిమాల్లో కూడా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. సంకీర్తన, హలో బ్రదర్, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. నాగచైతన్యతో కలిసి శైలజా రెడ్డి అల్లుడు, బంగార్రాజు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోగా, అఖిల్ తో కలిసి హలో సినిమాలో సందడి అతనికి తల్లిగా కనిపించారు. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలతో కలిసి నటించి రమ్యకృష్ణ రికార్డు సృష్టించారు.