శివగామికి ఆ హీరో కూడా సైట్ కొట్టారా?
బాహుబలిలో శివగామి పాత్ర చేసి కెరీర్లో నటిగా మరో మెట్టు ఎక్కిన రమ్యకృష్ణ రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో కు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.;
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రమ్య కమర్షియల్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పలు సినిమాలు చేసి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు.
బాహుబలిలో శివగామి పాత్ర చేసి కెరీర్లో నటిగా మరో మెట్టు ఎక్కిన రమ్యకృష్ణ రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో కు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రమ్యకృష్ణ ఎంట్రీతో షో లో హీట్ పెరిగిందని చెప్పి ఎపిసోడ్ ను మరింత ఎంటర్టైనింగ్ గా మార్చారు జగపతి. షో లో భాగంగా నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుందని అడగ్గా దానికి రమ్యకృష్ణ ఇచ్చిన ఆన్సర్ హైలైట్ గా నిలిచింది.
ఆ ఐటెమ్ సాంగ్స్ మళ్లీ చేయాలనుంది
తాను చేసిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలనుందని చెప్పి ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ, బాహుబలి సినిమాలో శివగామిగా నటించినప్పుడు నిజంగానే తాను రాజమాతలా ఫీలయ్యానని అన్నారు. చిన్నప్పట్నుంచి నీకు చాలా మంది సైట్ కొట్టడాలు, ప్రేమించడాలు, పడి దొర్లడాలు, వెంటపడటాలు అని జగపతి అంటుంటగానే నువ్వు కూడా అంటూ జగపతి ఫేస్ మీదే అనేశారు రమ్య. దానికి జగపతి బాబు కూడా నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు.
ప్రపంచంలో ఎవరైనా ఫోన్ చేస్తే హలో అంటారు కానీ ఈమె మాత్రం హే.. అంటుందని జగపతి బాబు, రమ్యకృష్ణ గురించి చెప్పారు. రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి కార్ కోసం వెయిట్ చేస్తే ఎవరు ఎక్కించుకోకుండా ఉంటారని జగపతి బాబు అనగా, నువ్వు చాలా అందమైన, దయ కలిగిన హీరోవని, అందరి హీరోయిన్ల విషయంలోనూ ఇలానే ఉంటావని రమ్య చెప్పడంతో జగ్గూ భాయ్ ఒక్కసారిగా షాకవడంతో పాటూ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఫుల్ ఎపిసోడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది.