• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ సుక్కు మెగా ప్లాన్...

చరణ్ సుక్కు మెగా ప్లాన్ అదేనా..?

| ఐతే ఈ సినిమా తర్వాత పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న చరణ్ ఆ మూవీతో ఐతే నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.

By - Tupaki Desk
Update: 2024-08-07 00:30 GMT

RRR తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాం చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో భారీ ప్లానింగ్ తోనే ఉన్నట్టు తెలుస్తుంది సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా అందుకు తగినట్టుగా షెడ్యూల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమాతో కూడా మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు చరణ్.

ఐతే ఈ సినిమా తర్వాత పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న చరణ్ ఆ మూవీతో ఐతే నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో ఆల్రెడీ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ నెక్స్ట్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో ప్లానింగ్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. ఈ సినిమాలో చరణ్ లుక్, స్టైల్ అన్ని కూడా వేరే లెవెల్ అనిపిస్తాయని తెలుస్తుంది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే ఎక్కువ టైం తీసుకోనున్నాడని టాక్. ఎలాగు బుచ్చి బాబు సినిమా చేసేంత వరకు సుకుమార్ ఫ్రీగా ఉండాల్సిందే. ఈ లోగా చరణ్ సినిమాపై కసరత్తులు చేస్తాడని తెలుస్తుంది.

సుక్కు చరణ్ కాంబో ఈసారి గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా స్క్రీన్ ప్లే రాసుకుంటాడని తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా సుకుమార్ కెరీర్ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అంతేకాదు సినిమా కోసం ఎంతోమంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ను తీసుకోనున్నారని తెలుస్తుంది. మొత్తానికి రంగస్థలం కాంబో ఈసారి సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా వీర లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఐతే RC 17పై వస్తున్న ఈ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. సుకుమార్ చరణ్ కాంబో సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చి వెంటనే చరణ్ సినిమా పనులు మొదలు పెట్టాలని చూస్తున్నాడు సుకుమార్.

Tags:    
  • Ramcharan 
  • Sukmar 
  • Pushpa2 
  • Buchibabu 
  • Rc16 
  • Panindianmovies 
  • Filmindustry 
  • Tollywood 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS