• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాధలో ఉన్న నిర్మాతకు చరణ్...

బాధలో ఉన్న నిర్మాతకు చరణ్ ఓదార్పు

| టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకొని తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న వ్యక్తి దిల్ రాజు

By - Tupaki Desk
Update: 2023-10-10 10:36 GMT

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకొని తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న వ్యక్తి దిల్ రాజు. నిర్మాతగా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో హిట్ చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించారు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది.

పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే దిల్ రాజు తండ్రి మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిల్ రాజు కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు. చాలా మంది నిర్మాతలు కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతాపం ప్రకటించారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేరుగా దిల్ రాజు ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు.

తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియన్ లెవల్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తోన్న మొట్టమొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే దిల్ రాజు సక్సెస్ లో తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి ప్రోత్సాహం ఉందని చెప్పాలి. అందుకే తండ్రి మరణం దిల్ రాజుని దుఖంలో ముంచేసింది.

శ్యామ్ సుందర్ రెడ్డి మరణంతో పలువురు సినీ ప్రముఖులు దిల్ రాజుని కలిసి తన సానుభూతి తెలియజేస్తున్నారు. ట్విట్టర్ లో ప్రొడక్షన్ హౌస్ లు అన్ని కూడా శ్యామ్ సుందర్ రెడ్డి మరణంపై నివాళి అర్పిస్తూ ట్వీట్ లు చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Tags:    
  • Ramcharan 
  • Dilraju 
  • Shyamsunderreddy 
  • Filmindustry 
  • Gamechangermovie 
  • Shankar 
  • Charan 
  • Tollywood 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS