మిథిలా సెట్ లో స్వ‌యంవ‌రం!

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం `రామాయణ్‌`. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు నితేష్ తివారీ పౌరాణిక గాథను వెండితెరపై ఓ అద్భుత దృశ్యకావ్యంగా మలిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు;

Update: 2026-05-10 16:30 GMT

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం `రామాయణ్‌`. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు నితేష్ తివారీ పౌరాణిక గాథను వెండితెరపై ఓ అద్భుత దృశ్యకావ్యంగా మలిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తాజాగా ముంబైలో వేసిన భారీ మిథిలా నగరం సెట్‌లో సినిమాలోని అత్యంత కీలకమైన సీత స్వయంవరం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ వేడుకను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ స్వయంవరం ఘట్టం రామాయణంలోనే అద్భుతమైన మలుపు.

జనక మహారాజు కొలువులో శివ ధనుస్సును ఎక్కుపెట్టి సీతమ్మను రాముడు వివాహం చేసుకునే ఈ సన్నివేశం కోసం ముంబై స్టూడియోలో కోట్ల రూపాయల వ్యయంతో ఒక రాజభవనం సెట్‌ను నిర్మించారు. ఆ కాలం నాటి వైభవం ఉట్టిపడేలా మిథిలా నగర సంస్కృతి ప్రతిబింబించేలా కళా దర్శకులు ప్రతి చిన్న అంశాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దారు. షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడితే త్రేతాయుగంలో ఉన్నామా ? అనే అనుభూతి కలుగుతోందని సినీ వర్గాలు అంటున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సన్నివేశాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ముఖ్యంగా స్వయంవరం వేదికపై సాయి పల్లవి సీతమ్మ పాత్రలో అత్యంత దైవికంగా కళాత్మకంగా కనిపిస్తోందని సమాచారం. ఈ ఘట్టం కోసం పదుల సంఖ్యలో ఇతర రాజులు, వందలాది మంది సహాయ నటీనటులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సహజమైన సెట్టింగ్స్ కలయికతో ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. శివ ధనుస్సును రాముడు భగ్నం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు అత్యున్నత స్థాయి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

కేవలం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడకుండా నటీనటుల హావభావాలు , ఆ సన్నివేశంలోని ఉద్వేగం ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ అయ్యేలా నితేష్ తివారీ చిత్రీక‌రిస్తున్నారుట‌. స్వయంవరం ఘట్టం పూర్తయ్యాక రామ-సీతల వివాహ వేడుకను కూడా అదే స్థాయిలో అట్టహాసంగా చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. నటీనటుల ఎంపిక మాత్రమే కాకుండా సెట్స్ , కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చిత్ర బృందం ఎక్కడా రాజీ పడలేదు.

ముంబైలో జరుగుతోన్న ఈ షెడ్యూల్ సినిమాలోని మొదటి భాగానికి అత్యంత కీలకం. బాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీల కలయికతో రూపొందుతున్న చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. స్వయంవరం సందడి రామాయణ చిత్రంపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. పురాణాల్లోని గొప్పతనాన్ని నేటి తరం టెక్నాలజీతో జోడించి చూపిస్తున్న ఈ ప్రయత్నం వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News