రామాయణ ట్రీట్ గురించి కామిక్ కాన్‌లో ఏం చెప్పారంటే?
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక విలువలతో తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణం' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ సరికొత్త రికార్డులకు తెరలేపుతున్నాయి.
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక విలువలతో తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణం' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ సరికొత్త రికార్డులకు తెరలేపుతున్నాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాకు సంబం ధించిన ఫస్ట్ లుక్ .. ట్రైలర్ లాంచ్ లాంటి కీలక అప్‌డేట్‌ను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికాలోని ప్రసిద్ధ శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా అద్భుత దృశ్యకావ్యానికి సంబంధించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.
హాలీవుడ్ స్థాయి ప్రాజెక్ట్‌లతో సమానంగా భారతీయ పౌరాణిక కథను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఏ తేదీ? ఏ సమయంలో అప్డేట్ రానుందనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అప్పుడే హడావుడి మొదలైంది.
ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ అంకితభావం, ప్రతినాయకుడిగా యష్ నటన సినిమా ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేసింది. నివార్ టెక్నాలజీలు .. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను ఈ చిత్రంలో వాడుతుండటంతో? ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కామిక్-కాన్ లాంటి అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేయాలనే మేకర్స్ వ్యూహం స్పష్టమవుతోంది. భారతీయ ఇతిహాసాలను ఆధునిక సాంకేతికతతో మేళవించి తెరకెక్కించడం అంత సులభం కానప్పటికీ నంబియ్యిన నిపుణుల బృందం ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మలుస్తోంది. దశాబ్దాలుగా దేశంలో నానిన రామాయణ కథను ఒక సినిమాగా కాకుండా దృశ్య అనుభూతిగా అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ కామిక్-కాన్ లాంచ్ ఈవెంట్ ద్వారా సినిమాపై అంతర్జాతీయ మీడియా దృష్టి కూడా పడే అవకాశం ఉంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్‌తో పోటీ పడే స్థాయికి ఎదిగిందనడానికి ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ .. యష్ వంటి స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం అభిమానులకు కన్నుల పండువగా నిలుస్తుంది. ఈ గ్లోబల్ ప్రమోషనల్ ఈవెంట్ అనంతరం సినిమాపై అంచనాలు ఏకంగా తారాస్థాయికి చేర్చడం ఖాయం. మొత్తానికి దర్శకుడు నితీష్ తివారీ కూడా ప్రమోషన్ విషయంలో రాజమౌళి తరహా వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. అంతర్జాతీయంగా సినిమా కనెక్ట్ అవ్వాలంటే? ప్రచారం కూడా అదే స్థాయిలో ఉండాలి. దేశ, విదేశాల్లో ప్రచారం భారీ ఎత్తున నిర్వహించాలి.ఆ ప్ర చారం కూడా ఎంతో యూనిక్ గా ఉండాలి. అప్పుడే సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు దక్కుతుంది. రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే? ఇంటర్నేషనల్ వేడుకలపైనా సినిమా నిలిచే అవకాశం ఉంటుంది.