రామ్ కమిట్మెంట్ లెక్క ఇది..!
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు.;
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అంతా సూపర్ హై ఇస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నారు.
టీజర్ ఇంప్రెస్ చేసింది..
ఆంద్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. రామ్ లోని ఎనర్జీని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు ఉన్నాడు. ఈ సినిమాలో రామ్ లుక్ క్రేజీగా ఉంది. యంగ్ లుక్స్ తో రామ్ మళ్లీ దేవదాస్ రోజులు గుర్తు చేసేలా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ చాలా రిస్క్ తీసుకుని మరీ షూట్ చేస్తున్నారట.
సినిమాలో ఒక వాటర్ ఎపిసోడ్స్ ఉండగా బురద నీటిలో అది కూడా నెక్ వరకు వచ్చే నీటిలో దాదాపు 8 గంటలు నీటిలో నానిపోయాడట రామ్. ప్రతి సినిమాకు రామ్ తన బెస్ట్ ఎఫర్ట్ పెడుతాడు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు అది ఇంకాస్త ఎక్కువ ఉందట. సినిమాతో ఎలాగైనా మెమొరబుల్ హిట్ కొట్టాలని కసితో చేస్తున్నాడని తెలుస్తుంది. హీరోగానే కాదు ఈ సినిమా కోసం రాం లిరిక్ రైటర్ గా కూడా మారాడు. రీసెంట్ గా సినిమా నుంచి రిలీజైన నువ్వుంటె చాలే సాంగ్ కి రాం లిరిక్స్ అందించాడు. ఆ లిరిక్స్ చూసిన ఎవరైనా రామ్ లో ఉన్న ఈ హిడెన్ టాలెంట్ చూసి షాక్ అవ్వాల్సిందే.
సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్..
ఉస్తాద్ రామ్ పోతినేని కూడా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో చేసిన ఈ సీన్ అతని సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటన్నది తెలిసేలా చేస్తుంది. ఈమధ్య రామ్ సినిమాలు కాస్త డిజప్పాయింట్ చేసినా ఈ ఆంధ్రా కింగ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు రామ్. తప్పకుండా రామ్ చేస్తున్న ఈ ఎఫర్ట్స్ కి తగిన ఫలితం వస్తుందనిపిస్తుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ నువ్వుంటే చాలే సూపర్ హిట్ అయ్యింది. మరి రామ్ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.