పెద్ది బాక్సాఫీస్.. ప్రీమియర్ టికెట్ల రేట్లు ఇవే!

'RRR' తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆయనకు వచ్చిన గుర్తింపుతో, ఇప్పుడు రాబోతున్న 'పెద్ది' సినిమాపై ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి;

Update: 2026-05-10 09:18 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'RRR' తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆయనకు వచ్చిన గుర్తింపుతో, ఇప్పుడు రాబోతున్న 'పెద్ది' సినిమాపై ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించి, నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

యూఎస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో టికెట్ రేట్లను అనౌన్స్ చేశారు. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే మెగా ఫ్యాన్స్ టికెట్ల కోసం పోటీ పడుతుండటంతో అక్కడ థియేటర్ల వద్ద ఇప్పుడే సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ 3న జరిగే తెలుగు ప్రీమియర్ షోల కోసం ప్రత్యేకమైన ప్రైసింగ్ లను ఖరారు చేశారు. స్టాండర్డ్ 2D ఫార్మాట్‌లో ప్రీమియర్ టికెట్ ధరలను 25 డాలర్లు, 20 డాలర్లుగా నిర్ణయించారు.

ఒకవేళ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ లో సినిమా చూడాలనుకుంటే అదనంగా మరో 5 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర స్పెషల్ ఫార్మాట్ల కోసం థియేటర్ లోకేషన్‌ను బట్టి 7 నుంచి 10 డాలర్ల వరకు ఎక్స్‌ట్రా ఛార్జ్ చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ దృష్ట్యా ఈ రేట్లు ఉన్నా సరే బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. కేవలం ప్రీమియర్లకే కాకుండా మొదటి వారం రెగ్యులర్ షోలకు కూడా రేట్ల విషయంలో స్పష్టత ఇచ్చారు.

మొదటి వారంలో తెలుగు వెర్షన్ టికెట్ ధరలు 20 డాలర్లు, 18 డాలర్లుగా ఉంటాయి. ప్రీమియం స్క్రీన్లకు మాత్రం 2 నుంచి 5 డాలర్ల వరకు సర్ ఛార్జ్ వర్తిస్తుంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఉన్న హైప్ కారణంగా మొదటి వారం యూఎస్ బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.

మరోవైపు ఇతర భాషల వెర్షన్ల విషయంలో మాత్రం మేకర్స్ కొంత వెసులుబాటు కల్పించారు. హిందీ, తమిళ్, మలయాళ కన్నడ వెర్షన్లకు ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ ప్రైసింగ్ ఉండదు. ఆయా భాషల ప్రేక్షకులకు సినిమాను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో సాధారణ టికెట్ రేట్లనే వర్తింపజేస్తున్నారు. దీనివల్ల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా కూడా మంచి రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది.

ఒరిజినల్ వెర్షన్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూనే, మిగిలిన భాషల్లో కూడా వీలైనంత ఎక్కువ మందికి సినిమాను చేరువ చేయడమే టీమ్ అసలు స్ట్రాటజీలా కనిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో చరణ్ లుక్ ఎమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం యూఎస్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే, ఓవర్సీస్ మార్కెట్ లో చరణ్ తన పాత రికార్డులను తానే తిరగరాసేలా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తోంది. మరి జూన్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News