పెద్ది: అసలు ఆయుధం వదిలేది అప్పుడే!

జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా మేకర్స్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2026-05-11 17:03 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందో అనే క్యూరియసిటీ ఇండస్ట్రీలో గట్టిగానే కొనసాగుతోంది. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద బిగ్ స్టార్ సినిమా వచ్చి చాలా రోజులైంది. సమ్మర్ వృధా అయ్యింది. అందుకే పెద్దిపై ఫోకస్ గట్టిగానే ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక పక్కా లోకల్ నేటివిటీతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.



 


జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా మేకర్స్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ఒక రేంజ్ లో రీచ్ అవ్వగా, ఇప్పుడు అందరి చూపు మే 18న రాబోయే అసలైన అప్ డేట్ మీద ఉంది. ​నిజానికి ఒక సినిమా రేంజ్ ఏంటనేది ట్రైలర్ విడుదలయ్యాక కానీ క్లారిటీ రాదు. అందుకే పెద్ది టీమ్ తమ 'అసలు ఆయుధం' లాంటి ట్రైలర్‌ను మే 18న రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఇప్పటివరకు వచ్చిన చిన్న చిన్న గ్లింప్స్ లో చరణ్ లుక్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం కథలోని ఇంటెన్సిటీని, కుస్తీ పోటీల నేపథ్యాన్ని పక్కాగా చూపించబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురవాలంటే ఈ ట్రైలర్ తోనే ప్రేక్షకులకు ఒక సాలిడ్ ఇంప్రెషన్ ఇవ్వాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

రైల్వే ట్రాక్ మీద నెత్తిన మూట, చేతిలో పాత పెట్టె పట్టుకుని నవ్వుతూ వెళ్తున్న చరణ్ ను చూస్తుంటే, సినిమాలో ఒక బలమైన ఎమోషనల్ జర్నీ ఉండబోతోందని అర్థమవుతోంది. 'హిజ్ స్టోరీ విల్ బి స్పెషల్' అనే ట్యాగ్‌లైన్ కథలోని లోతును తెలియజేస్తోంది. చరణ్ బాడీ లాంగ్వేజ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ బుచ్చిబాబు చాలా కేర్ తీసుకుని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. రంగస్థలం తర్వాత చరణ్ మళ్ళీ ఒక పవర్ ఫుల్ పల్లెటూరి పాత్రలో కనిపిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

​ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం పాటలు ఇప్పటికే మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవల్లో బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక మే 18న రాబోతున్న ఆ ట్రైలర్ తో బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారతాయో చూడాలి. 'పెద్ది' టీమ్ పక్కా ప్లానింగ్ తో జూన్ 4వ తేదీ కోసం సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కింది. మరి మే 18న విడుదల కాబోతున్న ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News