వీక్ డేస్ లో 'పెద్ది' సేమ్ స్పీడ్.. బుకింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే?

ఆన్‌ లైన్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం బుక్ మై షోలో గత 24 గంటల్లో లక్షా డెబ్బై వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

Update: 2026-06-09 05:45 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే మంచి వసూళ్లు సాధిస్తున్న ఆ చిత్రం, వీకెండ్ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారీ చిత్రాలకు వీకెండ్‌ లో మంచి కలెక్షన్లు వచ్చినా, సోమవారం నుంచి వసూళ్లు తగ్గడం కనిపిస్తుంది. అయితే పెద్ది విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

మూవీ టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి నాలుగు రోజుల్లోనే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఐదో రోజుకే రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమనే అంచనాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే మూవీ రన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోమవారం కూడా థియేటర్లలో రెస్పాన్స్ పాజిటివ్ గా ఉండటం మూవీ యూనిట్ లో మరింత జోష్ నింపింది.

వీకెండ్ ముగిసిన తర్వాత చాలా ప్రాంతాల్లో టికెట్ సేల్స్ స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లోనూ మంచి డిమాండ్ కనిపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి చూపిస్తోంది. ఇక మంగళవారం పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌ లైన్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం బుక్ మై షోలో గత 24 గంటల్లో లక్షా డెబ్బై వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీక్‌ డేస్‌ లో కూడా ఈ రేంజ్ లో బుకింగ్స్ నమోదు కావడం విశేషమే చెప్పాలి. దీంతో పెద్దికి ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సినిమా విడుదలైన తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్, రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో మౌత్ పబ్లిసిటీ కూడా సినిమాకు కలిసి వస్తోందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ వల్ల వీకెండ్ తర్వాత కూడా థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ కొనసాగుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బుకింగ్ ట్రెండ్‌ ను చూస్తే రాబోయే రోజుల్లో కూడా పెద్ది మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే సినిమా త్వరగానే లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది.

ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఆ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.

Tags:    

Similar News