లంకలో శూర్పణఖ అత్యంత అందమైన మహిళగా!
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `రామాయణం` పై ఎప్పటికప్పుడు ఆసక్తికర కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `రామాయణం` పై ఎప్పటికప్పుడు ఆసక్తికర కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సాధారణంగా రామాయణంలో శూర్పణఖ పాత్రను క్రూరమైన, ప్రత్యామ్నాయ ఛాయలున్న పాత్రగా చూపిస్తుంటారు. అయితే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన కోణం గురించి రకుల్ పాజిటివ్ గా స్పందించారు. లంకలో శూర్పణఖ అత్యంత అందమైన మహిళగా పరిగణించబడేదని గుర్తు చేశారు. ఈ పాత్ర కేవలం నెగెటివ్ షేడ్స్ ఉన్నది మాత్రమే కాదు. కథాగమనంలో ఎంతో కీలమైనదిగా, విభిన్నమైన భావోద్వెగాలతో సాగుతుందని తెలిపారు.
ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం దర్శకుడు నితీశ్ తివారీ ప్రత్యేకమైన లుక్ .. బాడీ లాంగ్వేజ్‌ను డిజైన్ చేశారని, దానిని తెరపైకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్నానని వెల్లడించారు. సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పాత్రను అత్యంత జాగ్రత్తగా మలుస్తున్నట్లు తెలిపారు.
రామాయణాన్ని ఆధునిక సాంకేతిక హంగులతో ఏమాత్రం మూలాలకు భంగం కలగకుండా తెరకెక్కుతున్న తీరు అద్భుతంగా ఉంటుందని రకుల్ అభిప్రాయపడ్డారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ..సెట్స్ రూపకల్పన హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో భాగం కావడం ద్వారా తన నటనా పరిధిని మరింత విస్తరించుకోవడానికి అవకాశం దొరికిందని రకుల్ తెలిపారు.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి చారిత్రాత్మక .. ప్రత్యామ్నాయ పాత్రల్లో నటించడం ద్వారా నటిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయోచ్చని రకుల్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రంపై రకుల్ చాలా ఆశలే పెట్టుకుంది. కమర్శియల్ సినిమాలు ఎన్ని చేసినా? ఇలాంటి చిత్రాల్లో చిన్న పాత్ర పోషించినా వచ్చే గుర్తింపు చరిత్రలో నిలిచిపోతుందన్నది కాదనలేని నిజం. రామాయణంలో అవకాశం దక్కించుకున్న నటులంతా నిజంగా అదృష్టవంతులేనని రకుల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి రకుల్ చేతిలో ఉన్న చిత్రం కూడా ఇదొక్కటే. బాలీవుడ్ లో అమ్మడు కొత్తగా ఏ చిత్రాలు కమిట్ అవ్వలేదు. ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం లేదు.