సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ - మానస శర్మ గ్లోబల్ సక్సెస్ స్టోరీ
థియేటర్లలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ‘రాకాస’ ఇప్పుడు గ్లోబల్ వేదికపై సత్తా చాటుతోంది.;
థియేటర్లలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ‘రాకాస’ ఇప్పుడు గ్లోబల్ వేదికపై సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 చార్ట్స్‌లో చోటు సంపాదించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది. ఒక మహిళా దర్శకురాలిగా మానస శర్మ తీసిన ఈ ఫాంటసీ కామెడీ చిత్రం, అంతర్జాతీయ ఆడియన్స్‌ను సైతం మెప్పించడం విశేషం. కేవలం మన దగ్గరే కాదు, గ్లోబల్ లెవల్‌లో ఈ సినిమా ఇప్పుడు ఒక సెన్సేషన్..ఆ విశేషాలు చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7:
‘రాకాస’ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడమే కాదు, వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో గ్లోబల్ చార్ట్‌లో 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన చిత్రాల జాబితాలో మన తెలుగు సినిమా నిలవడం నిజంగా గర్వకారణం.
మహిళా దర్శకురాలి ‘సైలెంట్ విక్టరీ’:
సాధారణంగా చిత్ర పరిశ్రమలో మాస్ సినిమాలు తీసే దర్శకులకే ఎక్కువ పేరు వస్తుంటుంది. కానీ మానస శర్మ లాంటి కొత్త మరియు మహిళా దర్శకురాలు, ఎమోషన్స్‌ను ఫాంటసీని కలిపి సినిమాను డీల్ చేసిన విధానం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో ఆమె పేరు వినిపించేలా చేస్తోంది. ఇక ఎక్కడా తడబడకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కు నచ్చేలా తీర్చిదిద్దడంలో ఆమె సక్సెస్ అయ్యారు.
పిల్లలకు ఫాంటసీ.. పెద్దలకు కామెడీ:
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అందుకే ఇంత పెద్ద హిట్ ఐయింది. ఇక చిన్న పిల్లలకు ఇందులో ఉండే ఫాంటసీ ఎలిమెంట్స్ నచ్చితే, పెద్దలకు సంగీత్ శోభన్ – గెటప్ శ్రీను మధ్య వచ్చే కామెడీ ట్రాక్ పడిపడి నవ్వేలా చేస్తోంది. ఇక వెన్నెల కిషోర్ తనదైన నటనతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచారు. ఇక సమ్మర్ సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉండటమే ఈ మూవీకి పెద్ద అసెట్.
నిర్మాతగా నిహారిక కొణిదెల సక్సెస్:
ఇక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంకరేజ్ చేయడంలో నిహారిక అభిరుచికి ఈ సక్సెస్ ఒక నిదర్శనం. సంగీత్ శోభన్, నయన్ సారికల కెరీర్‌కు కూడా ఈ సినిమా గ్లోబల్ హిట్ అవ్వడం పెద్ద బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి.
మొత్తానికి ‘రాకాస’ కేవలం ఒక చిన్న సినిమాగా మిగిలిపోకుండా, నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్లోబల్ సెన్సేషన్‌గా మారింది. ఒక మహిళా దర్శకురాలు తలుచుకుంటే బాక్సాఫీస్ దగ్గరే కాదు, గ్లోబల్ చార్ట్స్‌లో కూడా మ్యాజిక్ చేయగలరని మానస శర్మ నిరూపించారు. మన తెలుగు సినిమా ఇలా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. మీరు ఇంకా చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడే చూసేయండి..